Hyderabad: ఆగిపోయిన దీక్షిత యూట్యూబ్ చానెల్‌.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..

చిన్నారి దీక్షితకు ఓ యూట్యూబ్‌ చానెల్ ఉంది. రెండు వందల మంది సబ్‌స్కైబర్లు కూడా ఉన్నారు. దీక్షిత చేసిన అల్లరిని.. డ్యాన్సులను.. ముద్దు ముద్దు మాటలను ఆ చానెల్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. దీక్షిత మరణంతో.. ఆ యూట్యూబ్‌ చానెల్‌ కూడా మూగబోయింది.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 02:21 PM IST

Hyderabad: హైదరాబాద్‌ బాచుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దీక్షిత అనే బాలిక చనిపోయింది. బైక్‌ గుంతలోకి వెళ్లడంతో.. రోడ్డు మీద ఎగిరిపడింది దీక్షిత. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన స్కూల్ బస్సు దీక్షిత పైనుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. ముక్కుపచ్చలారని ముద్దులొలికే చిన్నారి ఇక లేదు అన్న విషయమే.. చాలామంది మనసులను కలచివేస్తోంది. ఆ చిట్టి తల్లి ఫొటో చూసినప్పుడల్లా కన్నీరు ఆగడం లేదు ఎవరికీ.

ఈ ప్రమాదానికి కారణం ఎవరు.. కాంట్రాక్టర్లదా.. ప్రభుత్వానిదా.. లేదంటే బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమా అన్న సంగతి ఎలా ఉన్నా.. లోకం చూడని ఓ చిన్నారి ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయింది. కాగా.. చిన్నారి దీక్షితకు ఓ యూట్యూబ్‌ చానెల్ ఉంది. రెండు వందల మంది సబ్‌స్కైబర్లు కూడా ఉన్నారు. దీక్షిత చేసిన అల్లరిని.. డ్యాన్సులను.. ముద్దు ముద్దు మాటలను ఆ చానెల్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. దీక్షిత మరణంతో.. ఆ యూట్యూబ్‌ చానెల్‌ కూడా మూగబోయింది. ఈ ఛానల్‌ తన సొంతమని, ఓ వీడియోలో దీక్షిత స్వయంగా చెప్తూ.. సబ్‌స్కైబ్ చేసుకోండి ప్లీజ్ అంటూ ఆ చిన్నారి మాట్లాడుతున్న వీడియో చూస్తుంటే.. వీక్షకులకు కన్నీరు ఆగడం లేదు! ఇక బాచుపల్లి ప్రమాదానికి సంబంధించి.. ఓనర్‌ గాజులరామారం మహదేవపురానికి చెందిన సత్యంరాజు, డ్రైవర్‌ షేక్‌రహీంను పోలీసులు అరెస్ట్‌ చేసి బస్సును సీజ్‌ చేశారు. బస్సుకు ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ లేవని తేల్చారు. ఇ

లాంటి బస్సును వినియోగిస్తున్నందుకు నిజాంపేటలోని భాష్యం స్కూల్‌ నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు డ్రైవర్‌ రహీంకు కుడిచేయి గాయమైంది. పైగా చిన్నారిని ఢీకొట్టిన సమయంలో అతను ఫోన్‌లో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది.