ANDHRA PRADESH: మహారాష్ట్రలోని సాంగ్లీ, ఖానాపూర్, సతాలా జిల్లాల నుంచి రెండేళ్ళపాటు బహిష్కరణకు గురైన గ్యాంగ్ అది.. కారణం వారికున్న నేర చరిత్ర.. అలాంటి గ్యాంగ్ టార్గెట్ పుడు ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాపై పడింది. అనుకున్నదే తడవుగా పక్కా స్కెచ్ వేసి బంగారు వ్యాపారి ఇంట్లో సుమారు ఆరుకోట్ల విలువ చేసే బంగారాన్ని అపహరించుకుపోయారు. జిల్లా పోలిసుల తెగువతో ఇపుడు కటకటాలు లెక్కబెడుతున్నారు. గత నెలలో పశ్చిమగోదావరిజిల్లా తణుకులో బంగారు వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కలకలం రేపింది.
ఇంట్లో వారందరినీ తాళ్ళతో కట్టేసి, లాకర్లో ఉన్న బంగారం ఎత్తుకుపోయారు ఐదుగురు ముఠా సభ్యులు. ఈ ఘటనతో ఆప్రాంతం అంతా ఉలిక్కిపడింది. వివారాల్లోకి వెళితే తణుకు పట్టణంలోని నడిబొడ్డున జరిగిన చోరీ పోలిసులకు సవాల్‌గా మారింది. సెప్టెంబర్ 12న రేణుక బంగారు దుకాణ యజమాని నాందేవ్ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులు అతనితోపాటు అతని భార్య, పిలల్ని కట్టేసి, లాకర్ తాళాలు తీసి, బంగారం మొత్తం దోచుకుపోయారు. ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి వారిని విడిపించారు. చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుడి కంప్లైయింట్‌తో రంగంలోకి దిగిన పోలిసులకు కేసు పెద్ద సవాల్‌గా మారింది. గ్యాంగుగా వచ్చి పక్కా ప్లాన్ ప్రకారం దోచుకుపోయిన దొంగల ఆచూకి కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంట్లో వారిలో ఎవరిని అనుమానించాలో అర్ధంకాక ఒక్కొచిక్కు విప్పుకొంటూ వచ్చారు.
Diwali : దీపావళి కి సెలవులు రద్దు.. కేంద్ర ఎన్నికల సంఘం..
చిన్న క్లూ దొరకడంతో తీగలాగితే డొంక కదిలినట్టు అసలు దోషులెవరో కనిపెట్టగలిగారు. చోరీ చేసింది ఎవరో తెలిసినా.. వాళ్ళను పట్టుకోవడం మరో పెద్ద సవాల్‌గా మారింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన గ్యాంగ్ ఈ చోరికి పాల్పడిందనే విషయాన్ని కనిపెట్టారు పోలీసులు. బంగారు వ్యాపారి ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పెద్ద మొత్తంలో బంగారం దోచుకుపోయారు గ్యాంగ్. దీంతో సుమారు నలభై రోజుల పాటు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మాటు వేసి అక్కడి క్రైం బ్రాంచి పోలీసుల సాయంతో నిందితులను పట్టుకోగలిగారు. ఈనెల 18న ప్రధాన నిందితుడు అమిత్ సంపత్ పాటిల్‌తొ పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసారు. మహారాష్ట్రలోని విటా పట్టణం చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎక్కువ శాతం మంది బంగారం కరిగించే పనిని వృత్తిగా చేసుకుని దేశంలోని చాలా పట్టణాలలో పనిచేస్తున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ప్రదాన నిందితుడు నితిన్ జాదవ్ వారికి డబ్బు ఆశచూపించేవాడు. బదులుగా యజమానుల వివరాలను సేకరించేవాడు. అనువైన షాపులను ఎంచుకుని తన గ్యాంగుతో బంగారం దోచుకుపోయేవాడు. కాగా.. తణుకులో రేణుకా జ్యువెలర్స్ యజమాని నాందేవ్ దేవ్కర్ బంగారం కరిగించే వ్యాపారముతో పాటు బంగారం తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడు సూరజ్ కుమార్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు.
కేసులో ప్రదాన నిందితుడిగా ఉన్న నితిన్ జాదవ్ గత ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలై స్నేహితులైన అమిత్ సంపత్పాటి అనే చిక్య ద్వారా సూరజ్ కుమార్‌తో పరిచయం పెంచుకొని అతనికి డబ్బు ఆశ చూపించారు. అతను తన యజమాని ఇంట్లోకి దారి చూపించాడు. ప్లాన్ ప్రకారం ఓంకార్ జాదవ్ ద్వారా బినామీ సిమ్ కార్డులు తీసుకుని సెప్టెంబర్ 11, రాత్రి తణుకు వచ్చి నాందేవ్ ఇంటిపైన గల రూమ్‌లో నివాసం ఉంటున్న సూరజ్ గదిలో ఉండి, తర్వాతి రోజు చోరిచేసి పారిపోయారు. అయితే, పోలీసులు ఈ వివరాలు కనుక్కుని ప్రధాన సూత్రదారి నితిన్ పాండురంగ జాదవ్, అతడి అనుచరుడు ఓకార్ జాదవ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాదు.. వాళ్ళు దొంగిలించిన బంగారం సైతం రికవరీ చేశారు. ఇందులో ఎనిమిది కేజీల 816 గ్రాముల బంగారం, ఒక కారు ఉన్నాయి. వీటి విలువ రూ.5.30 కోట్లుగా ఉంది. ఈ దోపిడికి ప్లాన్ వేసిన నితిన్ జాదవ్‌పై గతంలో మహారాష్ట్ర , కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి.