ప్రేమిస్తున్నానని చెప్పి.. తమకు అప్సరను కార్తిక్ రాజు పరిచయం చేశాడని ఆమె వివరించారు. ఐతే అప్పటికే అప్సర బావపై ఆ కుటుంబం చీటింగ్ కేసు పెట్టడంతో పెళ్లి వద్దు అనుకున్నామని.. ఐతే కార్తిక్ ఒత్తిడి చేయడంతో సర్దుకుపోయి పెళ్లి చేశామని వివరించారు. కరోనా సమయంలో ఇద్దరి పెళ్లి చేశామని.. ఆ సమయంలో అప్సర తల్లి, అక్క బావ మాత్రమే వచ్చారని ఫోన్‌కాల్ ద్వారా చెప్పారు. పెళ్లి అయిన మొదటి రోజు నుంచే వేరు కాపురం పెట్టాలని అప్సర మొండికేయడం మొదలుపెట్టిందని.. వారికి స్వేచ్ఛ లేదన తాము కూడా అంగీకరించామని.. వేరు కాపురానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చామని వివరించారు ధనలక్ష్మీ.
అప్సర పేద కుటుంబానికి చెందినదని.. ఎలాంటి ఆస్తులు లేవని.. అప్సర ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాము చేయించిందే అన్నారు ధనలక్ష్మీ. వేరు కాపురం పెట్టిన తర్వాత కార్తిక్‌రాజులో మార్పు వచ్చిందని.. ఎందుకు అని నిలదీస్తే ఆసక్తికర విషయాలు చెప్పారని ధనలక్ష్మీ చెప్పారు. అప్సరకు సైకాలజీ సమస్యలు ఉన్నాయని చెప్పాడని.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి తనకు కావాల్సింది చేయించుకుంటుందని తన దగ్గర ఏడుస్తూ చెప్పాడని వివరించింది. అప్సర గర్భవతి అని తెలిసి చాలా సంతోషించామని.. పిల్లలు పుట్టాక అయినా మార్పు వస్తుందని ఆశపడ్డామని ధనలక్ష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు.
అప్సర తల్లి వేధింపుల కారణంగా.. కార్తిక్‌రాజు ఆత్మహత్య చేసుకున్నాడని.. చనిపోయిన విషయం కూడా తనకు చెప్పలేదని ధనలక్ష్మీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్తిక్ రాజు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అస్థికలను రామేశ్వరంలో కలపడానికి వెళ్లామని.. తిరిగి వచ్చేసరి అప్సర, ఆమె తల్లి అరుణతో కలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని ధనలక్ష్మీ చెప్పుకొచ్చారు. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతోందని.. అప్సరకు అసలు పెళ్లే కాలేదని చెప్పడంతో ఇవన్నీ బయటపెడుతున్నామని ధనలక్ష్మీ చెప్పుకొచ్చారు. ఈ కేసులో రోజుకో విషయంలో వెలుగులోకి వస్తోంది.
అప్సరను ప్లాన్ ప్రకారం పూజారి సాయికృష్ణ హత్య చేయగా.. ఆ తర్వాత జైల్లో అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బ్లాక్‌మెయిల్ చేయడంతోనే భయంతో ఇదంతా చేయాల్సి వచ్చిందని… తాను కూడా సూసైడ్ చేసుకుంటానని పోలీసుల ముందు సాయికృష్ణ కన్నీరు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయ్. ఇప్పుడేమో.. అప్సరకు ముందే పెళ్లి అయిందని.. గర్భవతి కూడా అని ఆమె అత్త ధనలక్ష్మీ కీలక వివరాలు బయటపెట్టారు. దీంతో ఇకపై ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.