Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. ఐదుగురికి గాయాలు..

బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే. స్థానికంగా ఇది చాలా ఫేమస్. నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఎప్పట్లాగే కస్టమర్లతో రామేశ్వరం కేఫ్ రద్దీగానే ఉంది.

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 03:41 PM IST

Bengaluru: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ పేలుడు ఘటనతో ప్రశాంతంగా ఉన్న బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Smita Sabharwal: తొలిసారి రేవంత్‌ను కలిసిన స్మితా.. ఎందుకంటే..

బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫే. స్థానికంగా ఇది చాలా ఫేమస్. నిత్యం కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా ఎప్పట్లాగే కస్టమర్లతో రామేశ్వరం కేఫ్ రద్దీగానే ఉంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కస్టమర్ తెచ్చిన ఒక బ్యాగ్ ఉన్నట్లుండి పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందితోపాటు, మరో ఇద్దరు కస్టమర్లు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు జగరడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కస్టమర్లంతా పరుగులు తీయడంతో మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రామేశ్వరం కెఫే కూడా భారీగా ధ్వంసమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరా ప్రకారం.. ఒక బ్యాగ్‌లో పేలుడు పదార్ధాన్ని ఉంచి, దాన్ని రిమోట్‌తో పేల్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బ్యాగ్‌ను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కుట్ర కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకైతే, ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద లేదా తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.