ఈ న్యూస్ ఇప్పుడు బీ టౌన్‌ను షేక్ చేస్తోంది. సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ తిహార్ జైల్‌లో ఉన్నాడు. ఖాన్ మీద బిష్ణోయ్ ఇంత ద్వేషం పెంచుకోడానికి కారణం సల్మాన్ కృష్ణ జింకను వేటాడటం. 1998లో జోద్‌పూర్‌లో సల్మాన్ రెండు కృష్ణజింకలను చంపేశాడంటూ పూనంచంద్ బిష్ణోయ్ అనే వ్యక్తి పోలీసులు కంప్లైట్ చేశాడు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని చెప్పాడు.
సల్మాన్ ఖాన్, దుష్యంత్ సింగ్, దినేష్ గన్వారే ఈ నేరానికి పాల్పడ్డారని తేలడంతో కోర్ట్ వాళ్లకు జైలుశిక్ష విధించింది. కొన్ని రోజులు జైల్‌లో ఉన్న సల్మాన్.. తరువాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఈ ఘటన జరిగిన దాదాపు 25 ఏళ్లు గడిచింది.. కానీ ఆ పాపం మాత్రం సల్మాన్‌ను వెంటాడుతోంది. ఎందుకంటే కృష్ణజింక బిష్ణోయ్ కమ్యూనిటీ చాలా పవిత్రం. దేవుడితో సమానంగా భావిస్తారు. అలాంటి కృష్ణజింకను చంపేయడంతో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌పై ద్వేషం పెంచుకున్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు లారెన్స్ చాలా చిన్నవాడు. చిన్నతనం నుంచే సల్మాన్‌పై ద్వేషంతో పెరిగాడు.
గతంలో ఓ సారి సల్మాన్ హత్యకు రెక్కీ కూడా నిర్వహించినట్టు చెప్పాడు లారెన్స్. కానీ అప్పుడు చంపడం వీలు కాలేదని చెప్పాడు. తాను చనిపోయేలోగా సల్మాన్‌ను ఖచ్చితంగా చంపేస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పడు ఈ స్టేట్‌మెంట్ సంచలనంగా మారింది. ఎందుకంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా పెద్దది. అత్యంత ప్రమాదకరం కూడా. నార్త్ ఇండియాలో దాదాపు అన్ని స్టేట్స్‌లో బిష్ణోయ్ మనుషులు ఉన్నారు. దీంతో సల్మాన్‌కు ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌కు ప్రొటెక్షన్ ఇచ్చే పనిలో ఉన్నారు ముంబై పోలీసులు.