అనాథ శవాలతో వ్యాపారం.. కోల్‌కతా కాలేజీ ప్రిన్సిపాల్‌ దారుణాలు..

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసులో విచారణ మొత్తం వచ్చి.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ చుట్టూ చేరింది. ఈ దారుణంలో అతని పాత్ర ఉందని.. చాలావేళ్లు ప్రిన్సిపాల్‌ వైపు చూపిస్తున్నాయ్. ఇప్పటికే సీబీ అధికారులు ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను ఓసారి ప్రశ్నించారు. ఐతే చాలా ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పినట్లు గుర్తించిన అధికారులు..

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 02:54 PM IST

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసులో విచారణ మొత్తం వచ్చి.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ చుట్టూ చేరింది. ఈ దారుణంలో అతని పాత్ర ఉందని.. చాలావేళ్లు ప్రిన్సిపాల్‌ వైపు చూపిస్తున్నాయ్. ఇప్పటికే సీబీ అధికారులు ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను ఓసారి ప్రశ్నించారు. ఐతే చాలా ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పినట్లు గుర్తించిన అధికారులు.. అతనికి పాలీగ్రఫీ పరీక్షలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రిన్సిపాల్‌ సందీప్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. అనాధ శవాలను కూడా సందీప్‌ విక్రయించేవాడని… బంగ్లాదేశ్‌కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మెడికల్ కాలేజీ మాజీ ఉద్యోగులు చెప్తున్నారు.

వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకొనేవాడు. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి.. ప్రస్తుతం ముర్షిదాబాద్‌ డిప్యూటీ మెడికల్‌ కాలేజీ సుపరింటెండెంట్‌గా ఉన్న అక్తర్‌ అలీ పలు విషయాలపై ఈయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే ఘోష్‌ లీజుకు ఇచ్చేవాడు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరా కాంట్రాక్టులను.. తన వాళ్లకే ఇప్పించుకునే వాడు.

కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అర్హత లేని వారికి కట్టబెట్టేవాడు. కాంట్రాక్టర్ల నుంచి 20శాతం కమిషన్‌ పుచ్చుకొనేవాడని తెలుస్తోంది. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు తీసుకునేవాడని టాక్. ఉపయోగించిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులులాంటివి ఆసుపత్రిలో ప్రతీ రెండ్రోజులకు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీవాసుల సాయంతో ఘోష్‌ రీసైక్లింగ్‌ చేయించేవాడు. ఇక పర్సనల్‌గానూ ప్రిన్సిపాల్ పెద్ద సైకోగాడని తెలుస్తోంది. భార్యను దారుణంగా హింసించేవాడు. ఆమె సిజేరియన్‌ చేయించుకొని బిడ్డకు జన్మనిచ్చిన 14రోజుల తర్వాత… ఘోష్‌ తీవ్రంగా ఆమెపై దాడి చేసినట్లు.. ఇరుగుపొరుగు వారు ఇప్పటికీ ఆ దారుణాన్ని గుర్తుచేసుకుంటారు. ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావమైందని.. వాళ్లంతా కన్నీటి పర్యంతం అయ్యారు.