Cyber Crime 1930: తెలంగాణలో రోజుకు 3.30 కోట్ల రూపాయల సొమ్ము.. సైబర్ దొంగల పాలు !

నెలలో మొత్తం 150 కోట్లను సైబర్ దొంగలు కొట్టేస్తే అందులో 22 కోట్లను మాత్రమే పోలీసులు సకాలంలో ఆపగలిగారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దగ్గర 60 లక్షల రూపాయలను కొట్టేశారు.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 03:16 PM IST

Cyber Crime 1930: గడచిన ఐదు వారాల్లో రోజుకు 3 కోట్ల 30 లక్షల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును సైబర్ దొంగలు కొట్టేశారు. 2024 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 18 వరకూ పోలీసులకు 11 వేల మంది బాధితులు కంప్లయింట్ చేశారు. ఒక్క నెలలోనే తెలంగాణ నుంచి దాదాపు 150 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. సైబర్ క్రిమినల్స్ రోజు రోజుకీ కొత్త ప్లాన్స్‌తో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. స్కీములు, ఇన్వెస్ట్‌మెంట్స్, ఫెడ్ ఎక్స్ కొరియర్స్, ఆఫర్ల పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారు.

Smita Sabharwal: టార్గెట్ స్మిత సబర్వాల్.. ఆమె లెటర్ ఎందుకు రాశారు..?

నెలలో మొత్తం 150 కోట్లను సైబర్ దొంగలు కొట్టేస్తే అందులో 22 కోట్లను మాత్రమే పోలీసులు సకాలంలో ఆపగలిగారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దగ్గర 60 లక్షల రూపాయలను కొట్టేశారు. బిజినెస్‌లో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు వస్తాయంటూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది. టాస్కులు, ట్రేడింగ్ పేరుతో వచ్చే కాల్స్ నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా డబ్బులు కోల్పోయిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే.. వాటిని రికవరీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దనీ, అవసరంగా ఏ లింక్స్ ఓపెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మీ బ్యాంక్ ఖాతాలు, పిన్, ఓటీపీలు, ఆధార్ కార్డు నెంబర్ లాంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ట్రేడింగ్‌లో వేలు పెట్టుబడి పెడితే లక్షలు, కోట్లు వస్తాయని చెప్పే మాటలు అస్సలు నమ్మవద్దని చెబుతున్నారు. నష్టపోయినట్టు గ్రహించిన వెంటనే బాధితులు వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 8712672222 కు కాల్ చేయాలని చెప్పారు.