Chat GPT: ఇంతింత కాదయా.. ఆయన వివాదాలు అన్నట్లు ఉంటుంది నిత్యానంద తీరు !

నిత్యానందపై ఇండియాలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయ్. అందులో అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయ్. శిక్ష నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్న నిత్యానంద.. తనపై వస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తున్నాడు. ఇదే క్రమంలో

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 07:05 PM IST

నిత్యానంద వేషాలు చాట్‌జీపీటీ కూడా పట్టేసింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. అంతటితో ఆగకుండా తన దేశాన్ని గుర్తింపు దక్కాలన్న ఉద్దేశంతో.. ఏకంగా ఆయన ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరుకావడం వైరల్ అయింది. 

Nithyanandas Chat GPT shocking answer about Kailasa

తనపై భారత్ కక్షసాధిస్తోందంటూ ఐక్యరాజ్యసమితిలో ఆరోపిస్తున్నాడు. ఐతే ట్రెండింగ్‌లో ఉన్న చాట్‌జీపీటీని.. నిత్యానంద గురించి అడిగితే.. అది ఇచ్చిన ఆన్సర్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. నిత్యానంద కైలాసంని సందర్శించవచ్చా అని చాట్ జీపీటీని అడిగినప్పుడు అది షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. ఇది చట్టబద్ధమైన దేశం కానందున సందర్శకుల భద్రత శ్రేయస్సు కోసం ఆందోళనలు ఉన్నందున కైలాసని సందర్శించడం మంచిది కాదని తెలిపింది. ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఉన్న దేశాలనే సందర్శించాలన్నది చాట్ జీపీటీ సమాధానంగా తెలుస్తోంది. ఏదైనా ప్రయాణ గమ్యస్థానాన్ని క్షుణ్ణంగా పరిశోధించడం.. ప్రయాణ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భద్రత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం అని చాట్ జీపీటీ చెప్పుకొచ్చింది. నిత్యానంద సంగతి చాట్‌జీపీటీ కూడా తెలిసిపోయిందా అని నెటిజన్లు ఈ స్క్రీన్‌షాట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.