Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 29 మంది మావోల మృతి..?

ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. అలాగే ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 08:23 PM IST

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లాలోని ఛోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అక్కడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. అలాగే ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం.

Hardik Pandya: టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్.. పాండ్యాకు చోటు లేనట్టేనా ?

గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. మావోయిస్టులకు సంబంధించిన పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. భద్రత బలగాలపై మావోలు కాల్పులు జరపడంతో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇరు పక్షాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 29 మంది మావోలు మరణించినట్లు సమాచారం.

ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం కూడా లేదు. ఈ నెల 26న ఇక్కడ పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరగడం సంచలనం కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో ఇక్కడి బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ నెల 19నే పోలింగ్ జరుగనుంది.