Gangster Lands: గ్యాంగ్‌స్టర్‌ల భూములు పేదలకు పంచుతున్నాడు.. ఇది కదా సీఎం యోగి ఆధిత్యనాథ్‌ అంటే..

రీసెంట్‌గా దుండగుల చేతిలో హతమైన గ్యాగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ అక్రమంగా ఆక్రమించిన ఓ ప్లేస్‌లో యోగీ ప్రభుత్వం అపార్ట్‌మెంట్ నిర్మించింది. ఆ అపార్ట్‌మెంట్లో మొత్తం 76 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లను పేదలకు పంచాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 10:47 AM IST

గుండె తెగిపడుతున్నా పోరాడుతూ వెళ్లడం వీరుడి లక్షణం. ఒక చేత్తో పోరాటం చేస్తూనే ఇంకో చేత్తో రాజ్య ప్రజల్ని కాపాడుకోవడం రాజు లక్షణం. ఇలాంటి లక్షణం ఉంది కాబట్టే యూపీ ప్రజలు యోగిని రాజులా చూస్తుంటారు. యూపీలో మాఫియాను అంతమొందిచే దశగా అడుగులు వేస్తున్న యోగి.. ఒక్కో గ్యాంగ్‌స్టర్‌ను పిట్టలన్ని లేపేస్తున్నట్టు లేపేస్తున్నారు. యూపీని శాంతిభద్రతలకు నిలయంగా మారుస్తానని తాను సీఎం అయినప్పుడు ఏ ప్రమాణం చేశారో ఆ ప్రమాణానికి 100 శాతం కట్టుబడి పని చేస్తున్నారు.

రాష్ట్రంలో మాఫియాను అంతమొందించడమే కాదు.. అదే టైంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు కూడా నింపుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్‌ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ ఆస్తులను పేద ప్రజలకు పంచాలని నిర్ణయించారు సీఎం యోగి. రీసెంట్‌గా దుండగుల చేతిలో హతమైన గ్యాగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ అక్రమంగా ఆక్రమించిన ఓ ప్లేస్‌లో యోగీ ప్రభుత్వం అపార్ట్‌మెంట్ నిర్మించింది. ఆ అపార్ట్‌మెంట్లో మొత్తం 76 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లను పేదలకు పంచాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఇళ్ల పంపకాన్ని లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించాలని యోగి సూచించారు. సర్వే నిర్వహించి నిజంగా పేదలను గుర్తించి వాళ్లకు ఇళ్లు వచ్చేలా చూడాలనేది సీఎం యోగి ఆర్డర్‌. ఆ దిశగానే ఇప్పుడు యూపీ అధికారులు వర్క్‌ చేస్తున్నారు.

కేవలం అతీక్‌ మాత్రమే కాదు.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ప్రతీ గ్యాంగ్‌స్టర్‌ అక్రమాస్తులను పేదలకు పంచాలని నిర్ణయించారు యోగి. త్వరలోనే వాళ్తు ఆక్రమించుకున్న స్థలాల్లో కూడా ఇలాగే అపార్ట్‌మెంట్‌లు నిర్మించి వాటిని కూడా పేదలకు పంచే ఆలోచనలో యోగి సర్కార్‌ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో భూమి ఉంటే అది తమ పార్టీకి ఎలా ప్లస్‌ అవుతుందని చూసే ఈ రోజుల్లో.. ఉన్న భూమిని పేద ప్రజలకు పంచి ఇస్తున్నాడంటే యోగి రాజకీయ నేత కాదు లీడర్‌.. మాస్‌ లీడర్‌ అంటున్నారు ఆయనను అభిమానించేవాళ్లు.