Sukesh Chandrasekhar: బేబీ.. ఆరోజు బ్లాక్ కుర్తా వేసుకొని రా!

సుఖేష్ జైల్లో ఉన్నప్పటికీ ఓ ఫేక్ నెంబర్ ద్వారా మెస్సేజ్‌లు పెడుతున్నట్టు తెలుస్తోంది. 2023 జూన్ 30న సుఖేష్ పంపిన మెస్సేజ్‌లో.. కోర్టు హియరింగ్‌కి బ్లాక్ కుర్తా లేదంటే బ్లాక్ డ్రెస్ వేసుకు రమ్మని కోరాడు. అలా బ్లాక్ డ్రెస్‌లో వస్తే.. మెస్సేజ్‌లన్నీ చూసినట్టు.. తనపై ప్రేమ ఉన్నట్టు అని రాశాడు.

  • Written By:
  • Updated On - December 26, 2023 / 07:42 PM IST

Sukesh Chandrasekhar: 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో మొన్నటిదాకా ప్రేమ నటించాడు. ఇప్పుడు తన మాట వినడం లేదనీ.. తనకు వ్యతిరేకంగా కేసులు వేస్తోందని బెదిరింపులకు దిగుతున్నాడు. సుఖేష్ జైల్లో ఉన్నప్పటికీ ఓ ఫేక్ నెంబర్ ద్వారా మెస్సేజ్‌లు పెడుతున్నట్టు తెలుస్తోంది. 2023 జూన్ 30న సుఖేష్ పంపిన మెస్సేజ్‌లో.. కోర్టు హియరింగ్‌కి బ్లాక్ కుర్తా లేదంటే బ్లాక్ డ్రెస్ వేసుకు రమ్మని కోరాడు. అలా బ్లాక్ డ్రెస్‌లో వస్తే.. మెస్సేజ్‌లన్నీ చూసినట్టు.. తనపై ప్రేమ ఉన్నట్టు అని రాశాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నా బేబీ.. ఐ లవ్ యూ గాళ్.. నువ్వు ఎప్పటికీ నా దానవు.. అంటూ జాక్వెలిన్‌కు మెస్సేజ్ పెట్టాడు సుఖేష్.

YS SHARMILA: జగనన్న పైకి బాణం.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల..?

అతడి వాట్సాప్ మెస్సేజ్‌లో కోరినట్టుగా నటి జాక్వెలిన్ కోర్టు హియరింగ్‌కి బ్లాక్ డ్రెస్‌లో రాలేదు. దాంతో నిరుత్సాహంతో మళ్లీ ఇంకో మెసేజ్ చేశాడు. నువ్వు బ్లాక్ డ్రెస్‌లో రాలేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావో అర్థం కావట్లేదు. నా నుంచి దూరంగా వెళ్తున్నావా.. నన్ను అవైడ్ చేయాలని చూస్తే ఎలాంటి ఉపయోగం లేదు. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా అంటూ మరో మెసేజ్ ఫార్వార్డ్ చేశాడు సుఖేష్. అప్పటితో ఆగలేదు సుఖేష్.. మరోసారి జాక్వెలిన్ కోర్టుకు వచ్చే ముందు కూడా ఫలానా డ్రెస్సు వేసుకోమంటూ మెస్సేజ్ పెట్టాడు. ఈసారి మాత్రం.. కలర్ ఏదైనా వేసుకో.. లేదంటే రంగు రంగుల కుర్తా అయినా వేసుకో.. కానీ పైన మాత్రం ఎలాంటి డిజైన్ లేని వైట్ షర్ట్ వేసుకో.. దాన్నిబట్టి నువ్వు నా మెస్సేజెస్ చూస్తున్నావని అర్థమవుతుందని జాక్వెలిన్‌ను ఇబ్బంది పెట్టాడు సుఖేష్. జాక్వెలిన్‌కి సినిమా ఆఫర్ ఇప్పిస్తున్నట్టు ఇంకో మెస్సేజ్ చేశాడు సుఖేష్. రాబోయే రోజుల్లో ఓ మూవీ కోసం ఫిల్మ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లవ్ రంజన్ కలుస్తాడు. అతనితో డీల్ మాట్లాడాను.. ఇది నా బేబీ గాళ్‌కి ఇస్తున్న గిఫ్ట్.. అని అందులో ఉంది. వాళ్ళతో ఓ గిఫ్ట్ కార్డు పంపుతున్నాననీ.. అది నీకు నచ్చుతుందని కూడా మెస్సేజ్ చేశాడు సుఖేష్.

నటి జాక్వెలిన్‌పై.. ఇంత ప్రేమను ఒలకబోస్తూ మెసేజ్‌లు పెట్టిన సుఖేష్.. నాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే.. నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరించాడు కూడా. జాక్వెలిన్ తనను మోసం చేసిందనీ.. విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందనీ.. దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ హెచ్చరించాడు సుఖేష్. జాక్వెలిన్‌తో సంబంధాలు బయటపెడతాననీ.. కోర్టుకు, దర్యాప్తు సంస్థలకు ఇస్తానని బెదిరించాడు సుఖేష్. జాక్వెలిన్‌తో ఛాట్స్, స్క్రీన్ షాట్స్, రికార్డింగ్స్, విదేశీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తానన్నాడు. ఈ బెదిరింపులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్.. తనను సుఖేష్ బెదిరిస్తున్నాడనీ.. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. మనీ లాండరింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ.. తనను నిర్దోషిగా విడిచిపెట్టాలని కోర్టును ఆశ్రయించింది జాక్వెలిన్.