Jacqueline Fernandez: మనసు విరిచేశావ్.. ఆ ఫొటోలన్నీ బయటపెడతా.. జాక్వెలిన్‌కు సుకేష్‌ వార్నింగ్‌..

జాక్వెలిన్‌ గురించి ఇప్పటి వరకూ సుకేష్‌ రాసిన లెటర్స్‌ అన్నీ ఆమెపై ప్రేమను చెప్పేవే. కానీ మొదటిసారి అంతు చూస్తా అంటూ ప్రేయసి మీద కోపాన్ని వెల్లగక్కాడు సుకేష్‌. రీసెంట్‌గా జాక్వెలిన్‌.. సుకేష్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 07:53 PM IST

Jacqueline Fernandez: తిహార్‌ జైల్‌లో ఉన్న మనీ లాండరింగ్‌ నిందితుడు సుకేష్‌ చంద్రశేఖర్‌ మరో లెటర్‌ విడుదల చేశాడు. కానీ ప్రతీ సారిలాగా ఈసారి రిలీజ్‌ చేసిన లెటర్‌ ఏ పొలిటీషన్‌ గురించో, బిజినెస్‌ మ్యాన్‌ గురించో కాదు. స్వయనా తన ప్రియురాలు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గురించి. జాక్వెలిన్‌ గురించి ఇప్పటి వరకూ సుకేష్‌ రాసిన లెటర్స్‌ అన్నీ ఆమెపై ప్రేమను చెప్పేవే. కానీ మొదటిసారి అంతు చూస్తా అంటూ ప్రేయసి మీద కోపాన్ని వెల్లగక్కాడు సుకేష్‌.

Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌కు కోర్టు మొట్టికాయలు.. లక్షరూపాయల జరిమానా..

రీసెంట్‌గా జాక్వెలిన్‌.. సుకేష్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. సుకేష్‌ లెటర్స్‌ ద్వారా తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సుకేష్‌కు దిమ్మ తిరిగిపోయింది. దీంతో జాక్వెలిన్‌ను ఉద్దేశిస్తూ ఓ లెటర్‌ రిలీజ్‌ చేశాడు. తనపై కేసులు పెడితే.. తన దగ్గర ఉన్న పర్సనల్ స్క్రీన్ షాట్లు, లావాదేవీలు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. తాను కాపాడుకున్న వ్యక్తే తనను వెన్నుపోటు పొడవాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ జాక్వెలిన్‌ గురించి సుకేష్‌ ఎప్పుడు నెగెటివ్‌ కామెంట్స్‌ చేయలేదు. ప్రతీసారి ప్రియురాలిని మిస్‌ అవుతున్నానంటూ లెటర్స్‌ రాశేవాడు. కానీ, ఇప్పుడు ఆమె కోర్టు మెట్లు ఎక్కడంతో సుకేష్‌ కూడా ఎదురుతిరిగాడు. గతంలో సుకేష్, జాక్వెలిన్ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అంతేకాదు.. సుకేష్.. జాక్వెలిన్‌కు కోట్ల విలువైన బహుమతులు కూడా ఇచ్చినట్లు పెద్ద టాక్‌ నడిచింది. జాక్వెలిన్ పుట్టిన రోజున ఓ చారిటికి రూ.20 కోట్లు డొనేషన్ సైతం ఇచ్చాడు. ఈ తరుణంలో సుకేష్ వేధిస్తున్నాడంటూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయిచండం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుకేష్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లపై కూడా గతంలో సంచలన లేఖలు రాసి హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఇప్పుడు స్వయంగా ప్రియురాలికి వార్నింగ్‌ ఇచ్చి మరోసారి న్యూస్‌ హెడ్‌లైన్స్‌లోకి వచ్చేశాడు. మరి సుకేష్‌ లెటర్‌ మీద జాక్వెలిన్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.