THIEF COUPLE: దొంగ దొంగది.. పోలీసులమంటూ భారీ మోసం.. కిలాడీ జంట అరెస్ట్‌

డిపార్ట్‌మెంట్‌లో పని చేసినప్పుడు ఉన్న కాంటాక్ట్స్‌ వాడుకుని అందరినీ నిజంగానే తాను పోలీస్‌ అని నమ్మించాడు. డిపార్ట్‌మెంట్‌తో తనకు చాలా కాంటాక్ట్స్‌ ఉన్నాయని.. డబ్బులిస్తే జాబ్‌ పెట్టిస్తానంటూ కొందరు అమాయకులను నమ్మించాడు.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 06:47 PM IST

THIEF COUPLE: పోలీసులమని, పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు పెట్టిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఓ నకిలీ జంటను అరెస్ట్‌ చేశారు పోలీసులు. సుమారు 50కి కుచ్చుటోపీ పెట్టిన ఈ జంటకిలాడీలను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కథ వైజాగ్‌లో మొదలైంది. ఏపీ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే హనుమంత్‌ రమేష్‌ తన లవర్‌తో కలిసి ఈ మోసం చేశాడు. డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేస్తున్న టైంలో కూడా ఇలాంటి పనులే చేయడంతో అధికారులు అతన్ని సస్పెండ్‌ చేశారు.

BJP Operation Akarsh: బీఆర్ఎస్ నుంచి వలసలు.. మరో ఇద్దరికి బీజేపీ ఆఫర్ !

జాబ్‌ పోవడంతో విశాఖలోని పెందుర్తికి మకాం మార్చాడు. అక్కడ అందరికీ తనను తాను ఎస్సైగా పరిచయం చేసుకున్నాడు. అక్కడ పోలీస్‌ యూనిఫాంలోనే తిరగేవాడు. డిపార్ట్‌మెంట్‌లో పని చేసినప్పుడు ఉన్న కాంటాక్ట్స్‌ వాడుకుని అందరినీ నిజంగానే తాను పోలీస్‌ అని నమ్మించాడు. డిపార్ట్‌మెంట్‌తో తనకు చాలా కాంటాక్ట్స్‌ ఉన్నాయని.. డబ్బులిస్తే జాబ్‌ పెట్టిస్తానంటూ కొందరు అమాయకులను నమ్మించాడు. ఈ దందాకు ఉపయోగంగా ఉండేందుకు తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా పోలీస్‌ అంటూ అందరికీ పరిచయం చేశాడు. ఇద్దరూ యూనిఫాంలో తిరుగుతూ దాదాపు 30 మంది అమాయలను ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మాత్రమే కాదు.. రైల్వేలో కూడా తనకు పలుకుబడి ఉందని.. అక్కడ కూడా ఉద్యోగాలు పెట్టిస్తానంటూ మరి కొందరని నమ్మించాడు. ఇలా దాదాపు 50 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 3 కోట్లు వసూలు చేశారు రమేష్‌, అతని గర్ల్‌ఫ్రెండ్‌. డబ్బు తీసుకుని రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో.. డబ్బిచ్చిన అమయాలకు నిలదీశారు. దీంతో పెందుర్తు నుంచి మకాం లేపేశాడు. దీంతో మోసపోయామని అంతా అర్థం చేసుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. కాల్‌ డేటా ఆధారంగా రమేష్‌ అతని గర్ల్‌ఫ్రెండ్‌ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించా ఏపీ పోలీసులు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ సహాయంతో.. హైదరాబాద్‌లో నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీళ్లిద్దరూ విశాఖలోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి మోసాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే యాంగిల్‌లో విచారణ చేపడుతున్నారు. నిజాయితీగా ఎగ్జామ్స్‌ రాసి ఉద్యోగాలు తెచ్చుకోవాలి కానీ.. ఇలాంటి వాళ్లను నమ్మొద్దని చెప్తున్నారు పోలీసులు.