ఆమె శరీరం మొత్త చిద్రమైపోయింది. పుర్రె భాగం పూర్తిగా ధ్వంసమైంది. చాలా ఎముకలు విరిగిపోయాయి. వివరించేందుకు కూడా మాటలు రాని దారుణ హత్య అది. హత్య జరిగిన 18 గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మర్డర్ చేసిన వెంటనే నిందితుడు ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి బులంద్‌షహర్‌లోని తన రిలీటివ్స్ ఇంటికి వెళ్లాడు. తన తండ్రికి సమాచారం ఇచ్చేందుకు ఫోన్ ఆన్ చేసి తండ్రికి కాల్ చేశాడు. కానీ అప్పటికే సాహిల్ ఫోన్‌ను ట్రేజింగ్‌లో ఉంచిన పోలీసులు వెంటనే లొకేషన్ గుర్తించారు. వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడి గురించి నిజాలు తెలిపి పోలీసులే షాకయ్యారు. స్నేహితులతో కలిసి మందు తాగడం, హుక్కా కొట్టడం, గొడవలకు వెళ్లడం. ఇదే సాహిల్ డెయిలీ రొటీన్. అతని ఇన్‌స్టాగ్రాం ప్రొఫైల్‌లో 70శాతం హుక్కాతో ఉన్న ఫొటోలే ఉన్నాయి. పేరుకు ముస్లిం అయినా చాలా ఫొటోల్లో మెడలో రుద్రాక్షలు వేసుకుని ఉన్నాడు. సాహిల్ గతంలో కూడా కొన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్లు వేసి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెడితే.. దాన్ని కూడా ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. నిందితుడి దృష్టిలో అరెస్ట్ అవ్వడం అంటే ఒక స్టేటస్.
డాన్‌గా ఎదగాలనే మెంటాలిటీ ఉన్న మూర్ఖుడు. దాదాపు అన్ని పోస్టుల్లో సిద్ధూ మూసేవాలే పాటలకు డాన్స్ చేస్తూ హుక్కా కొడుతూనే కనిపించాడు సాహిల్. ఇక మహాత్మగాంధీ పుట్టిన రోజున గాంధీజీ ఫొటోకు డీజే వాలా సాంగ్ యాడ్ చేసి పోస్ట్ చేశాడు. ఈ ఒక్క పోస్ట్ చాలు ఈ కిరాతకుడు దేశంపై ఎంత వ్యతిరేకత ఉన్న వ్యక్తో చెప్పడానికి. కేవలం సాహిల్ మాత్రమే కాదు. తనతో ఉన్న ఫ్రెండ్స్, కొందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే. మంచి చెప్పేవాళ్లు లేకపోయినా చెడు స్నేహం ఉంటే మనిషి మృగంలా మారిపోతాడు. సాహిల్ దీనికి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తరువాత పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. చనిపోయిన అమ్మాయికి సాహిల్‌కు మూడేళ్ల నుంచి పరిచయం ఉందట. కానీ రీసెంట్‌గా సాహిల్ అలవాట్లు, బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకున్న అమ్మాయి సాహిల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ఈ విషయంలోనే సాహిల్‌కు అమ్మాయికి మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. అమ్మాయి తనకు దూరం అవుతుందని భావించిన సాహిల్ తనను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. బాలిక ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తోందన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దారిలో కాపుకాచాడు. అమ్మాయి కనిపించగానే అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఇలాంటి కిరాతకుడికి ఎన్‌కౌంటర్ కూడా తక్కువే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టిన సాహిల్‌కు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.