MAHARASHTRA: చాలా మంది ఉద్యోగులు తమ యజమానులకు ఎంతో గౌరవం ఇస్తారు. కుటుంబాన్ని పోషించునేందుకు ఆసరాగా ఉండే ఉద్యోగాన్నిచ్చినందుకు దైవంగా భావిస్తుంటారు. సంస్థ కష్టాన్ని కూడా పంచుకుంటారు. కొన్ని సంస్థలు కూడా ఉద్యోగులను అలాగే కాపాడుకుంటాయి. ఉద్యోగులు, కంపెనీల మధ్య ఉండాల్సిన బంధం అది. కానీ, దీపావళి పండగకు బోనస్ ఇవ్వలేదని కారణంగా ఇద్దరు వర్కర్లు ఏకంగా తన యజమానిని చంపేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది ఈ దారుణం.
Kunduru Jana Reddy: జానారెడ్డికి షాకిచ్చిన ఈసీ.. ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ..
స్థానికంగా ఓ గ్రామానికి సర్పంచ్‌గా పని చేసిన రాజు అనే వ్యక్తి పదవి పోయిన తరువాత అక్కడే ఓ డాబా ఏర్పాటు చేసుకున్నాడు. అదే జీవనాధారంగా బతుకుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ డాబాలో చోటు, ఆది అనే ఇద్దరు వర్కర్లు జాయిన్ అయ్యారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కూలీల కాంట్రాక్టర్ వీళ్లిద్దరినీ రాజుకు పనిచయం చేశాడు. కొంత కాలం ఇద్దరూ రాజు దగ్గర బాగానే పని చేశారు. రీసెంట్‌గా దీపావళి రావడంతో పండగ బోనస్ ఇవ్వాలటూ చోటు, ఆది.. రాజును కోరారు. కానీ తాను బోనస్ ఇచ్చే స్థితిలో లేనంటూ రాజు వాళ్లిద్దరికీ చెప్పాడు. కానీ దానికి చోటు, ఆది ఒప్పుకోలేదు. బోనస్ కావాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఈ విషయంలో వీళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాజుపై కోపం పెంచుకున్న ఆది, చోటు.. రాజును చంపేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత రాజు డాబాలోనే పడుకున్నాడు. రాజు నిద్రలోకి జారుకున్న తరువాత చోటు, ఆది ఇద్దరూ రాజుపై దాడి చేశారు. కత్తులతో పొడి చంపేశారు.
రాజు కారు తీసుకుని పారిపోయారు. పారిపోతుండగా విహారగడ్ సమీపంలో నిందితులిద్దరు కారుతో డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. తరువాత కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ విజువల్స్ అన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులు డాబాకు వచ్చారు. శవంగా పడి ఉన్న రాజును చూసి గుండెలు బాదుకున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.