DENSE FOG: ప్రాణం తీస్తున్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మంచు

మంచు అందాల్ని చూసేందుకు మిత్రులంతా కారులో బయల్దేరారు. కానీ కొద్ది సేపటికే మంచు కారణంగా దారి కనిపించక శివారెడ్డిపేట్‌ దగ్గర చెరువులోకి దూసుకెళ్ళిందో కారు. దీంతో అందులోని ఒకరు మరణించారు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 03:15 PM IST

DENSE FOG: మంచు అందాలు చూడాలని ఆరాటపడ్డారు. అంతా కలిసి కారులో బయల్దేరారు. ఏ అందాలైతే చూద్దామనుకున్నారో అవే అందాలకు ఒకరు బలైపోతారని పాపం ఊహించలేకపోయారు. వికారాబాద్‌ రోడ్డు ప్రమాదం గురించి వింటుంటే మనసు చలించిపోతోంది. ఈ జిల్లాలో మంచు కారణంగా జరుగుతున్న వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. బ్రో మీ కాళ్లు మొక్కుతాం.. బ్రో బతికించండి ప్లీజ్.. బ్రో కొద్దిగా రండి.. ప్లీజ్ బ్రో.. మీకు ఈత వస్తే.. వాళ్లని బతికించండి.. ఇది వికారాబాద్ శివారెడ్డిపేట్ దగ్గర ప్రమాదం జరిగిన చోట కనిపించిన హృదయ విదారక దృశ్యం. యాక్సిడెంట్ దగ్గర ఓ వ్యక్తి ప్రాధేయపడటం అందర్నీ కంటతడి పెట్టించింది.

Pakistan Polls: పాక్ ఎన్నికల్లో పోటీ చేయనున్న హిందూ మహిళ.. ఆమె ఎవరో తెలుసా..?

మంచు అందాల్ని చూసేందుకు మిత్రులంతా కారులో బయల్దేరారు. కానీ కొద్ది సేపటికే మంచు కారణంగా దారి కనిపించక శివారెడ్డిపేట్‌ దగ్గర చెరువులోకి దూసుకెళ్ళిందో కారు. దీంతో అందులోని ఒకరు మరణించారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. ఐదడుగుల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. లైట్లు వేసుకుని వెళ్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయంటే మంచు.. (స్నో డెవిల్‌) ఏ స్థాయిలో కమ్మేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం ఉదయం కూడా విపరీతమైన మంచు కురవడంతో శివారెడ్డి పేట్‌ దగ్గర్లోని చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌ హిల్స్‌ చూసేందుకు ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బయల్దేరారు. పొగ మంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. మొత్తం ఐదుగురు ప్రయాణికుల్లో నలుగురు బయటపడ్డారు. ఒకరు చెరువులో మునిగి చనిపోయారు. కారు దూసుకుని వెళ్లగానే అందులోంచి బైటపడ్డ వ్యక్తి.. మిగతావ్యక్తిని కాపాడమంటూ అందరినీ అర్ధించడం కంటతటి పెట్టించింది. చెరువులో దూసుకెళ్లిన కారును, క్రేన్ సాయంతో బయటికి తీశారు పోలీసులు.

పొగమంచు కారణంగా నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజి దగ్గర జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా అతడిని చూసేందుకు వస్తున్న బంధువులు కూడా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. విపరీతంగా మంచు కురుస్తున్న సమయంలో భారీ వాహనాలు సిగ్నల్‌ లైట్లు వేసి ఎక్కడో ఒక చోట నిలిపివేయడమే మంచిదంటున్నారు అధికారులు. అలాగే వాకర్స్‌, బైక్‌ల మీద వెళ్లేవారు కూడా లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.