Dimple Hayathi Issue: అంత పెద్ద ఐపీఎస్‌.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా..!

డింపుల్ వర్సెస్ డీసీపీ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. కోర్టు మెట్లెక్కే వరకు వెళ్లింది వ్యవహారం. దీంతో నెక్ట్స్ ఏం జరగబోతుందా అనే ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ముందు డింపుల్ మీద డీసీపీ కేసు పెట్టడం.. ఆ తర్వాత డింపుల్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ కావడం.. కోర్టుకెక్కడం.. ఇలా ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా మారిందీ ఎపిసోడ్‌లో.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 04:51 PM IST

ఆ తర్వాత ట్రాఫిక్‌ కోన్స్ విషయంలో.. కథ కొత్త మలుపు తీసుకుంది. రెడ్‌ కలర్ కోన్‌లను ఎన్‌క్లేవ్ పార్కింగ్‌లో పెడితే డింపుల్ తన్నుతుందని రాహుల్‌ ఆరోపించారు. ఐతే పార్కింగ్ ప్లేస్‌లో సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు కేసును కొత్త మలుపు తిప్పేలా కనిపిస్తోంది. డింపుల్‌కు ఇదే ఇప్పుడు ఆయుధంగా మారింది. ఇదే డీసీపీని ఇబ్బంది పెట్టడం కూడా ఖాయం అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసు.. ప్రభుత్వ ఆస్తుల చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వ ఆస్తిని డింపుల్ ధ్వంసం చేసిందని డీసీపీ కేస్ పెడితే.. ప్రభుత్వ ఆస్తిని డీసీపీ అనధికారంగా ఇంట్లో పెట్టుకున్నాడని కోర్టుకు ఫిర్యాదు చేసింది డింపుల్. ఇదే ఇప్పుడు డీసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

సామాన్యుడు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడంతో కంపేర్‌ చేస్తే.. తన ఇంట్లో ఒక ఐపీఎస్ అధికారి ప్రభుత్వ ఆస్తిని పెట్టుకోవడం పెద్ద నేరం. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన ఐపీఎస్ రాహుల్‌.. లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్లు అయింది. డింపుల్ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌ వ్యవహారంతో పోలీసు వ్యవస్థ మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు పోలీసు పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజీ కుదుర్చుకుంటారా.. లేదంటే రచ్చ కంటిన్యూ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. డీసీపీ, డింపుల్.. ఇద్దరు రాజీ పడి కేసులు విత్‌డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తన్నాయ్. ట్రాఫిక్‌ కోన్‌ను తన్నడం డింపుల్‌ తప్పే అయినా.. డీపీసీ మాత్రం తెలిసి నేరం చేసినట్లు అయింది. అంత పెద్ద ఐపీఎస్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారనే డిస్కషన్ నడుస్తోంది.