Atiq Ahmed Encounter: అతీక్ అహ్మద్.. ఖేల్ ఖతం..!!

అతీక్ అహ్మద్‌ను ఎవరు చంపారు.... ఎందుకు చంపారు అన్నది వేరే స్టోరీ. అతడిని చంపడం, చంపించడం న్యాయమా అంటే అది వేరే కథ... కానీ నేరమంటే పులిమీద సాములాంటిది. దాని మీద నుంచి కిందకు దిగలేరు. దిగితే బతకనివ్వదు... ఇక్కడా అదే జరిగింది. నేరాన్నే చిరునామాగా మార్చుకున్న అతీక్... అదే నేరానికి బలైపోయాడు.

  • Written By:
  • Updated On - April 16, 2023 / 08:03 AM IST

వివాదాస్పద గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ (Atiqe Ahmed) కథ ముగిసింది. కొడుకును పోలీసులు (Police) ఎన్‌కౌంటర్‌లో (Encounter) మట్టుబెట్టిన 48 గంటల్లోనే అతీక్ అహ్మద్‌ను (Atiq Ahmed) ప్రత్యర్థులు పాయింట్‌బ్లాంక్ (point blank) రేంజ్‌లో కాల్చి చంపారు. అతీక్ సోదరుడు (Atiq Brother) కూడా ఈ కాల్పుల్లో హతమయ్యాడు. తుపాకీ పట్టి వందల మందిని చంపి వేలమందిని బెదిరించి రాజులా రొమ్ము విరుచుకుని తిరిగిన అతీక్ అహ్మద్.. అదే తుపాకీకి (Gun) బలైపోయి దిక్కులేని శవంలా పడి ఉన్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు (Utter Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్ (Gangster), వివాదాస్పద రాజకీయనాయకుడు (Politician) అతీక్ అహ్మద్. వందకు పైగా కేసులు… దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు (Murders), మానభంగాలు (Rapes), బెదిరింపులు, భూకబ్జాలు (Land grabbing) ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చేయని నేరమంటూ లేదు. నేటితరం రాజకీయానికి మొదటి మెట్టైన గూండాయిజంలో (Gundaraj) మాస్టర్ డిగ్రీ చేశాడు అతీక్ అహ్మద్.
ఎలా జరిగింది…?
ప్రయాగరాజ్‌లో (Prayagraj) వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి (Hospital) తీసుకెళుతుండగా అతీక్ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను (Ashraf Ahmed) ముగ్గురు వ్యక్తులు తుపాకీలతో (Guns) కాల్చి చంపారు. చుట్టూ పోలీసులు (Police) వలయంలా ఉన్నప్పుడే మీడియా (Media) ముసుగులో వచ్చిన దుండగులు పాయింట్ బ్లాంక్‌లో అతీక్ అహ్మద్‌ను కాల్చిచంపారు. తుపాకీ (Pistol) దెబ్బకు అతీక్ అక్కడికక్కడే కూలిపోయాడు. అతడి సోదరుడు అష్రఫ్ కూడా రక్తపుమడుగులో పడిపోయాడు. పోలీసులు తేరుకునేసరికే 10రౌండ్ల (10 rounds) కాల్పులు జరిగిపోయాయు. పోలీసులు తేరుకునేసరికి అంతా అయిపోయింది. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లెవరు, ఎందుకు చంపారు అన్నది వేరే సంగతి. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడన్నది పాత సామెత. తుపాకీ పట్టిన అతీక్ అహ్మద్ అదే తుపాకీ గుండుకు బలైపోయాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా (MLA), ఎంపీగా (MP) గెలిచి చక్రం తిప్పిన అతీక్ అహ్మద్ (Atiq Ahmed) అనాథలా ఎవరికీ కాకుండా అనాథ ప్రేతంలా మిగిలిపోయాడు. తమ్ముడు తనతోపాటే పోయాడు. ఓ కొడుకు మట్టిపోయి ఒక్క రోజు కూడా కాలేదు. ఇద్దరు కొడుకులు వేర్వేరు జైళ్లలో (Jails) ఉన్నారు. మరో ఇద్దరు కొడుకులు జువైనల్ హోమ్‌లో (Juvenile home) ఉన్నారు. భార్య (Wife) పరారీలో ఉంది. ఎంత బలగం ఉన్నా ఇప్పుడు ఎవరూ లేని, ఎవరు పట్టించుకోని ఓ అనాథశవం అతీక్ అహ్మద్‌ది. కొన్నాళ్లు మీడియాకు ఆహారం మాత్రమే ఈ వార్త.
ఎవరు చంపి ఉంటారు…?
అతీక్ అహ్మద్‌కు చాలామంది శత్రువులు ఉన్నారు. వారిలో ఎవరు చంపించారో తెలియదు. అసలు అతీక్‌ను పోలీసులే (Police) చంపించారన్న అనుమానాలున్నాయి. కానీ దానికి ఆధారాలు దొరకవు. తమ చేతికి మసి అంటకుండా శత్రువుకు సమాచారం ఇస్తే చాలు. వారిపని వారు పూర్తి చేస్తారు. పోలీసుల సహకారం జరగకుండా ఈ కాల్పులు జరగడం అసాధ్యం. అతీక్ అహ్మద్ మోస్ట్ వాంటెండ్ (Most Wanted) అని అందరికీ తెలుసు. ఎప్పుడూ భారీగా పోలీసులు అతడి చుట్టూ ఉంటారు. అలాంటిది అంత భద్రతను చేధించుకుని కాల్పులు జరిపారంటే అది అనుమానాలకు తావిచ్చేదే. పైగా రాత్రి పదిన్నరకు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటన్నది కూడా మరో అనుమానం. పైగా అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్న విషయం పోలీసలకు మాత్రమే తెలుసు. దీన్ని బట్టి చూస్తుంటే పోలీసులే అతీక్ అహ్మద్ శత్రువులకు ఉప్పందించి ఉండొచ్చన్నది మరో ప్రచారం.
నేరాలకు చిరునామా అతీక్
అతీక్ అహ్మద్ నేర చరిత్ర (Criminal History) గురించి జనానికి చాలా తక్కువ తెలుసు. చిన్నప్పుడే పరిస్థితులు అతడ్ని నేరసామ్రాజ్యం వైపు నడిపించాయి. బతకడం కోసం అందులో అడుగుపెట్టి క్రైమ్‌లో (Crime) ఆరితేరిపోయాడు. జనాన్ని బెదిరించడం అతడికి ఆనందాన్ని ఇచ్చింది. అందులోనే బతికాడు. చివరకు నేరమనే తాడుకు మరో కొన అయిన రాజకీయంలోకి (Politics) అడుగుపెట్టాడు. 1989లో తొలిసారి ఇండిపెండెంట్‌గా (Independent) ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత రెండుసార్లు కూడా స్వతంత్రుడిగానే నెగ్గాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అతడికి తమ పార్టీ టికెట్ ఇచ్చింది. మరోసారి అప్నాదళ్ (Apna Dal) టికెట్‌పై గెలిచాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. ఇప్పటి హత్యకు అక్కడే బీజం పడింది. తన స్థానంలో తమ్ముడ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని చూశాడు. కానీ బీఎస్పీ (BSP) అభ్యర్థి రాజుపాల్ (Rajupal) చేతిలో అతడు ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలానికే రాజుపాల్‌ను దుండగులు కాల్చి చంపారు. అది అతీక్ పనేనని అందరికీ తెలుసు. క్రిమినల్ చరిత్ర కారణంగా అతీక్, అతడి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉండి కూడా దందాలు చేస్తుండటంతో గుజరాత్ (Gujarath) తరలించారు. ఈ ఫిబ్రవరిలో రాజుపాల్ హత్యకేసు సాక్షి అయిన ఉమేష్ (Umesh) హత్యకు గురికావడంతో అతీక్ అహ్మద్‌ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

నిజానికి అతీక్ అహ్మద్‌ను ఎప్పుడో పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారన్న ప్రచారం సాగింది. గుజరాత్ జైలు (Gujarat jail) నుంచి ప్రయాగరాజ్‌కు (Prayagraj) తీసుకొస్తున్న సమయంలోనే కాల్చి చంపుతారని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు అలాంటిదేమీ చేయలేదు. అయితే అతీక్ కొడుకు అసద్ (Atiq son Asad) మాత్రం పోలీసు తూటాలకు దొరికిపోయాడు. అప్పుడే అతీక్ (Atiqe Ahmed)) కుప్పకూలిపోయాడు. నన్ను వదిలేయండి ఇక నేనేం చేయను అని మీడియా సాక్షిగా వేడుకున్నాడు. చివరకు అదే మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

అతీక్ అహ్మద్‌ను ఎవరు చంపారు…. ఎందుకు చంపారు అన్నది వేరే స్టోరీ. అతడిని చంపడం, చంపించడం న్యాయమా అంటే అది వేరే కథ… కానీ నేరమంటే పులిమీద సాములాంటిది. దాని మీద నుంచి కిందకు దిగలేరు. దిగితే బతకనివ్వదు… ఇక్కడా అదే జరిగింది. నేరాన్నే చిరునామాగా మార్చుకున్న అతీక్… అదే నేరానికి బలైపోయాడు.