Putin: పుతిన్‌ మీద డ్రోన్‌ దాడి.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ?

ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ ఉన్న దేశం రష్యా. వరల్డ్‌లోనే మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌ పుతిన్‌. అలాంటి వ్యక్తిపై డ్రోన్‌ దాడి జరిగింది. అది కూడా ఏకంగా రష్యా ప్రెసిడెన్షియల్‌ హౌజ్‌ క్రెమ్లిన్‌ మీద. రాడార్‌లకు చిక్కకుండా క్రెమ్లిన్‌ మీదకు దూసుకువచ్చిన రెండు డ్రోన్స్‌ను అక్కడి సెక్యూరిటీ సిస్టమ్‌ కూల్చేసింది. ఈ డ్రోన్‌ ఎటాక్‌ దృష్యాలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దాడి జరిగిన వెంటనే రష్యా ఫారెన్‌ ఎఫైర్స్‌ మినిస్ట్రీ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది. పుతిన్‌ను చంపేందుకు యుక్రెయిన్‌ ఈ ఎటాక్‌ చేసిందని చెప్పింది. దీనికి ఖచ్చితంగా పర్యావసానాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 01:00 PM IST

మే9న రష్యాలో విక్టరీ డే సెలబ్రేషన్స్‌ జరుగుతాయి. 1945లో హిట్లర్‌ను రష్యా ఓడించిన సందర్భంగా ఎవ్రీ ఇయర్‌ మే9 న విక్టరీ డే సెలబ్రేట్‌ చేస్తారు. దీనికి 5 రోజుల ముందు అంటే మే3న క్రెమ్లిన్‌లో పరేడ్‌ నిర్వహిస్తారు. రష్యా ప్రెసిడెంట్‌, మినిస్టర్స్‌, ఫారెన్‌ గెస్ట్‌, అధికారులు అంతా ఈ పరేడ్‌కు వస్తారు. ఈ పరేడ్‌ను టార్గెట్‌గా చేసుకునే క్రెమ్లిన్‌ మీద డ్రోన్‌ఎటాక్‌ జరిగింది. కానీ అదృష్టవశాత్తూ పుతిన్‌ ఆరోజు పరేడ్‌లో లేరు. నోవో ఒగారియోవోలో ఉన్న తన ఇంటి నుంచి వర్క్‌ చేస్తున్నారు. ఒకవేళ పుతిన్‌ అక్కడే ఉన్నా.. డ్రోన్స్‌ ఆయనను రీచ్‌ అయ్యేవి కావు. ఎందుకంటే పుతిన్‌ మీద ఎటాక్స్‌ జరగడం ఇది మొదటి సారి కాదు.

గతంలో 5 సార్లు పుతిన్‌ చంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆయనకు సెక్యూరిటీ సిస్టమ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ డిస్ప్యూట్‌ ఏంటి అంటే.. డైరెక్ట్‌గా క్రెమ్లిన్‌ మీద ఎటాక్‌ చేసే సాహసం చేయడం. సింపుల్‌గా చెప్పాలంటే రష్యా ఇగోని హర్ట్‌ చేసినట్టే. అందుకే రష్యా ఇంత స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఖచ్చితంగా యుక్రెయిన్‌కు సమాధానం చెప్తామంటోంది. కానీ యుక్రెయిన్‌ మాత్రం ఈ దాడి తాము చేయలేదని చెప్తోంది. ఇది రష్యాలో ఉన్న తిరుగుబాటుదారులు చేసిన దాడి అని చెప్తోంది. ఈ దాడిని సాకుగా చూపి యుక్రెయిన్‌లోని టౌన్స్‌, విలేజెస్‌ మీద ఎటాక్‌ చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందిని ఆరోపిస్తోంది. కానీ రష్యా మాత్రం ఏం వినేందుకు రెడీగా లేదు. దెబ్బకు దెబ్బ అన్నట్టు.. దాడికి దాడే సమాధానం అంటోంది.

రష్యన్‌ ప్రైవేట్‌ ఆర్మీ వాగనార్‌ గ్రూప్‌ ఆల్రెడీ యాక్షన్‌లోకి దిగింది. యుక్రెయిన్‌లోని బక్మూత్‌ ఇప్పుడు వాగనార్‌ గ్రూప్‌ కంట్రోల్‌లోనే ఉంది. క్రెమ్లిన్‌ మీద ఎటాక్‌కు ప్రతీకారం ఆల్రెడీ స్టార్ట్‌ చేశామని వాగనార్‌ గ్రూప్‌ ఎనౌన్స్‌ చేసింది. ఈ దాడితో జెలెన్స్కీ పెద్ద తప్పు చేశాడని.. ఇప్పుడు జెలెన్‌న్స్కీని చంపడం తప్ప వేరే దారి లేదని ఓపెన్‌గానే వార్నింగ్‌ ఇస్తోంది. ఇదే జరిగితే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇప్పటికే ఈ ఇష్యూలో అమెరికా రష్యాను ఎగతాలి చేసింది. క్రెమ్లిన్‌ వరకూ డ్రోన్స్‌ వచ్చాయి అంటే రష్యా సెక్యూరిటీ సిస్టం ఎంత వీక్‌గా ఉందో తెలుస్తోంది అంటూ కామెంట్‌ చేసింది. అసలే డ్రోన్‌ ఎటాక్‌తో వేడి మీద ఉన్న రష్యా ఇలాంటి కామెంట్స్‌ వల్ల మరింత స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యే చాన్స్‌ ఉంది. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్‌ చూపించింది. ఇప్పుడు ఈ దాడి కారణంగా రష్యా మరోసారి భీకర దాడి ప్రారంభిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం జరగడం పక్కా. ఇప్పుడు పుతిన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుటారోనని ప్రపంచ దేశాలు టెన్షన్‌ పడుతున్నాయి.