DRUGS CASE: డ్రగ్స్ కేసులో యంగ్ హీరో లవర్‌.. ఆ హీరో ఎవరంటే..

పోలీసులు జరిపిన విచారణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌ కేసులో దొరికిన లావణ్య.. ఒకప్పుడు టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, యాడ్స్‌ చేసినట్లు గుర్తించారు. ప్రముఖ హీరోకు ఈమె గాళ్‌ఫ్రెండ్ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది.

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 07:30 PM IST

DRUGS CASE: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. హైదరాబాద్‌ నార్సింగిలో ఎస్ఓటీ పోలీసులు జరిపిన దాడుల్లో.. లావణ్య అనే యువతి డ్రగ్స్‌తో పట్టుబడింది. డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా ఇన్ఫర్మేషన్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా లావణ్యను పట్టుకున్నారు. ఆమె నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

PRASANTH VARMA: వివాదంలో వర్మ.. హనుమాన్ డైరెక్టర్‌‌పై విమర్శలు..

పోలీసులు జరిపిన విచారణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌ కేసులో దొరికిన లావణ్య.. ఒకప్పుడు టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, యాడ్స్‌ చేసినట్లు గుర్తించారు. ప్రముఖ హీరోకు ఈమె గాళ్‌ఫ్రెండ్ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆ హీరో పేరును పోలీసులు సీక్రెట్‌గా ఉంచారు. ఐతే ఆ హీరో రాజ్ తరుణ్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోన్నాయి. దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నిందితురాలిపై పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఆమె గోవా నుంచి ఎన్ని గ్రాముల డ్రగ్స్ తీసుకువచ్చింది.. ఎవరి దగ్గరి నుంచి తెచ్చింది.. ఎవరి కోసం తెచ్చింది.. ఎందుకు తెచ్చింది.. తను వాడుకోవడానికే తెచ్చిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంలో కూడా టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు నమోదయ్యాయ్. ఐదేళ్ల కింద.. డ్రగ్స్ వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. సిట్‌ ఇన్వెస్టిగేషన్‌ కూడా అయింది.

డైరక్టర్లు, హీరోలు, కెమెరామెన్‌లు.. ఇలా అందరూ విచారణలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో పేరుతో.. ఈ కేసులో దొరికిన యువతికి సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారంతో.. మళ్లీ కొత్త చర్చ మొదలైంది. పోలీసుల అదుపులో ఉన్న లావణ్య… నిజంగా హీరో రాజ్‌తరుణ్‌ లవరా.. ఇది నిజమా కాదా.. జస్ట్‌ ప్రచారం మాత్రమేనా అనే చర్చ జరుగుతోంది. ఐతే ఈ కేసులో సినిమా హీరో పేరు వినిపిస్తుండడంతో.. ఇంకెలాంటి లింక్‌లు బయటకు వస్తాయనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.