Drugs Seized: పాక్ డ్రగ్స్ రాకెట్ ముఠా అరెస్ట్.. 600 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

పాక్ నుంచి ఒక పడవలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా భారత అధికారులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భారీ ఓడలతో పాటు ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌నీ సిద్ధం చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 07:22 PM IST

Drugs Seized: పాక్‌కు చెందిన డ్రగ్స్ ముఠాను భారత నేవీ అధికారులు పట్టుకున్నారు. గుజరాత్ తీర ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన 14 మంది డ్రగ్స్ ముఠాను ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది. వారి నుంచి రూ.600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్‌ని స్వాధీన చేసుకుంది. శనివారం అర్ధరాత్రి చేపట్టిన ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది.

YS JAGAN: చంద్రబాబును నమ్మితే.. చంద్రముఖిని నిద్రలేపినట్లే: వైఎస్ జగన్

పాక్ నుంచి ఒక పడవలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా భారత అధికారులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భారీ ఓడలతో పాటు ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌నీ సిద్ధం చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇది గమనించి పాక్ డ్రగ్స్ ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కోస్ట్ గార్డ్ టీమ్‌ వాళ్లు ఎటూ తప్పించుకోకుండా చుట్టుముట్టింది. ఈ క్రమంలో పాక్ సభ్యులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే, భారత బృందాలు వారిని చుట్టుముట్టడంతో దొరికిపోయారు. మొత్తం 14 మంది పాక్ డ్రగ్స్ ముఠా సభ్యుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 86 కిలోల నిషేధిత డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తోపాటు పాకిస్థాన్ పౌరులను, వారి పడవను పోరబందర్‌కి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో పాక్ నుంచి రహస్యంగా భారత్‌కు డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్‌ ల్యాబ్‌ల గుట్టును ఇటీవల నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రట్టు చేసింది. ఈ ల్యాబ్‌ల నుంచి రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది.