చికోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధముని భావిస్తున్న చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డి, సంపత్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. క్యాసినో కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్ని ఆరోపణలో చికోటి ప్రవీణ్ విషయంలో తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటికి వచ్చాయి. తెలుగు రాస్ట్రాల నుంచి చాలా మంది ప్రముఖులను విదేశాలకు తీసుకువెళ్లి ప్రవీణ్ క్యాసినో నిర్వహించాడని తెలిపారు అధికారులు. వీళ్ల దగ్గర్నించి ప్రవీణ్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు.
ఈ వ్యవహారం మొత్తం మనీలాండరింగ్ ద్వారా జరిగిందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కేసు కంటిన్యూ అవుతున్న సమయంలో బ్యాంకాక్‌లో ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రవీణ్‌తో పాటు సుమారు 90 మంది తెలుగు వాళ్లను అరెస్ట్ చేశారు. ఇందులో చిట్టి దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డి కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీళ్లందరినీ ప్రవీణ్ థాయిలాండ్‌కు తీసుకువెళ్లి క్యాసినో ఆడించాడని పోలీసులంటున్నారు. కానీ తాను గెస్ట్‌గా మాత్రమే వెళ్లానని.. అక్కడ నిర్వహించిన క్యాసినోకు తనకు ఎలాంటి సబంధం లేదని చికోటి ప్రవీణ్ చెప్పాడు.
క్యాసినోకు అక్కడ అనుమతి లేదన్న విషయం కూడా తనకు తెలియది..తెలిస్తే వెళ్లేవాన్ని కాదని థాయిల్యాండ్ కోర్టులో చెప్పాడు. దీంతో 4 వేల 500 ఫైన్ విధించి చికోటి ప్రవీణ్ గ్యాంగ్‌ను విడిచిపెట్టింది థాయ్ ప్రభుత్వం. ఇండియాకు వచ్చిన వెంటనే ఇప్పుడు ఈడీ ప్రవీణ్‌కు మరోసారి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.