Ex Girl Friend: మాజీ ప్రియుడిపై పగ తీర్చుకుంనేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది ఓ లా స్టూడెంట్. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచె అన్నట్టు.. ఆ యువతి ప్లాన్ మొత్తం పసిగట్టారు పోలీసులు. ఆమెతో సహా మొత్తం గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి లోపలేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది ఈ ఘటన. హైదరాబాద్‌లోని ఓ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేస్తున్న ఓ యువతికి కొన్ని రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ జరిగింది. అదికాస్తా బ్రేకప్ వరకూ వెళ్లింది. దీంతో ప్రియుడి మీద కోపం పెంచుకున్న యువతి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
YS SHARMILA: జగనన్న పైకి బాణం.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల..?
కోపం ఉంది కానీ ఆ కోపాన్ని తీర్చుకునే మార్గం ఆమెకు కనిపించలేదు. దీంతో తానే కర్త, కర్మ, క్రయ అయ్యి.. ప్రియుడిని ఇరికించాలని ఫిక్స్ అయ్యింది. లా తెలివి వాడి తన స్నేహితుల ద్వారా గంజాయి సేకరించింది. ఆ గంజాయిని మరో ఫ్రెండ్ సహాయంతో ప్రియుడి కారులో పెట్టించింది. తరువాత తానే పోలీసులకు ఫోన్ చేసి ఆ కారులో గంజాయి సరఫరా జరుగుతోందిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పోలీసులు ఆ కారును ఆపి చెక్ చేయడంతో నిజంగానే కారులో 40 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు పోలీసులు. తనకే పాపం తెలియదని ఆ అబ్బాయి ఎంత చెప్పినా వినలేదు. కానీ.. పోలీసుల విచారణలో అబ్బాయికి క్లీన్ రికార్డ్ వచ్చింది. గతంలో కేసులు గానీ, గంజాయి డీలర్స్‌తో కాంటాక్స్ట్ కానీ ఏవీ ట్రేజ్ కాలేదు. దీంతో ఆ అబ్బాయి చెప్పేది నిజమే అనుకుని.. అమ్మాయి యాంగిల్‌లో విచారణ చేయడం ప్రారంభించారు పోలీసులు.
అమ్మాయిని పిలిపించి ఆ కారులో గంజాయి ఉన్న విషయం ఎలా తెలుసంటూ విచారించారు. క్రాస్ క్వశ్చనింగ్ చేయడంతో అమ్మాయి దొరికిపోయింది. దీంతో అమ్మాయిని, ఆమెకు సహకరించి మొత్తం స్నేహితుల బ్యాచ్‌ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. లవర్ మీద కోపంతో పగ తీర్చుకోవాలనుకుని తానే కేసులో ఇరుక్కుంది ఈ అమ్మాయి.