LOCAL BOI NANI: నాని అరెస్ట్‌..? విశాఖ ప్రమాదం వెనక యూట్యూబర్ నాని.. అసలేం జరిగింది..?

యూట్యూబ్‌లో లోకల్‌బాయ్‌గా ఫేమస్ అయిన నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని.. తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఆ తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి, బాలాజీ అనే వ్యక్తికి ఒకటో నెంబర్‌ జెట్టిలో గొడవ జరిగింది.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 05:41 PM IST

LOCAL BOI NANI: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో వందకు పైగా బోట్లు కాలి బూడిదయినట్లు తెలుస్తోంది. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అంచనాలు వినిపిస్తున్నాయ్. ప్రమాదానికి గురైన బోట్లలో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయి. అటు చేపలతోపాటు బోట్లు కూడా అగ్నికి ఆహుతి కావడంతో మత్స్యకారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఐతే ఈ ప్రమాదానికి సంబంధించి కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.

ALLU ARJUN: ఏపీ సీఎం జగన్‌కు స్టైలిష్ స్టార్‌ ఝలక్‌..!

యూట్యూబ్‌లో లోకల్‌బాయ్‌గా ఫేమస్ అయిన నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని.. తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఆ తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి, బాలాజీ అనే వ్యక్తికి ఒకటో నెంబర్‌ జెట్టిలో గొడవ జరిగింది. ఈ గొడవే ప్రమాదానికి దారి తీసి ఉంటుంద‌నే అనుమానాలు వినిపిస్తున్నాయ్. లోకల్ బాయ్ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టగా.. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా కొంత డబ్బు కూడా చెల్లించాడు బాలాజీ. ఐతే కొద్దిరోజుల తర్వాత తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని నానిని బాలాజీ గట్టిగా అడిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి కూడా ఇద్దరు కలుసుకున్నారని.. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసిందని తెలుస్తోంది. బాలాజీ, నానికి మధ్య గొడవ జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా.. ఘటనా స్థలం దగ్గర నాని ఓ లైవ్ వీడియో తీశాడు.. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన గురించి అసలు నిజాలు ఏంటి అన్నది మిలియన్‌ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం నానితో పాటు.. అతడి స్నేహితులు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుసతోంది. లోకల్ బాయ్‌గా ఫేమస్ అయిన నాని.. వైజాగ్‌ సముద్రంలో చేపల వేట, చేపల మార్కెట్‌కి సంబంధించిన వీడియోలు తీసీ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. వ్యూయర్‌షిప్‌ కూడా చాలా బాగుంటుంది.