Food poison in Rails: రైళల్లో బిర్యానీ తిని… 9 మంది అస్వస్థత !

రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అమ్ముతున్న ఆహారపదార్థాల్లో కల్తీ జరుగుతోంది. ఫుడ్ పాయిజన్ అయి రాజమండ్రి హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న సంఘటనలు రెండు జరిగాయి. దాంతో ఫుడ్ క్వాలిటీ మీద రైల్వే అధికారులు దృష్టి పెట్టాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 11:28 AM IST

విశాఖపట్నం రైల్వేస్టేషన్ తో పాటు రైళ్ళల్లో కొన్న బిర్యానీ తిని తొమ్మది మంది అస్వస్థులయ్యారు.  రాజమహేంద్రవరం GGH  బాధితులు చికిత్స పొందుతున్నారు.  పట్నా–ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ (22644) లో 15 మంది భవన నిర్మాణ కార్మికులు పట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళ్తున్నారు.  విశాఖ రైల్వే స్టేషన్ లో బిర్యానీలు కొన్నారు. అవి తిన్న అరగంట తర్వాత వాళ్ళల్లో ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి.  నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు కొందరు ప్రయాణీకులు.  సాయంత్రం 6 గంటలకు రాజంమండ్రి రైల్వే స్టేషన్ లో పోలీస్ సిబ్బంది వారిని దించి వెంటనే GGH కు తరలించారు.  దిభ్రూగఢ్ – కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ రైల్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. కేరళలోని పాలక్కడ్ కు వెళ్తున్న ఏడుగురు విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటాక… రైలులో అమ్ముతున్న ఎగ్ బిర్యానీలు తిన్నారు.  కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు.  రైలు రాత్రి ఒంటి గంట టైమ్ లో రాజమండ్రి చురుకున్నాక రైల్వే, పోలీస్ సిబ్బంది వాల్ళని GGH లో చేర్పించి చికిత్స అందించారు.   ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు చెబుతున్నారు.  రైళ్ళల్లో ఫుడ్ సరిగా లేకపోవడంపై ప్రయాణీకులు మండిపడుతున్నారు.  రైళ్ళల్లో అమ్మే ఆహారం, నీళ్ళ బాటిల్స్ కల్తీ కాకుండా రైల్వేశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.