HYDERABAD: నైస్‌గా కొట్టేశారు.. శ్రీరామనవమి శోభాయాత్రలో జేబుదొంగల చేతివాటం

ఎట్టకేలకు యాత్ర నిర్వహించారు రాజాసింగ్. ఐతే ఈ యాత్రలో జనం ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. కొందరు భక్తుల ఖరీదైన సెల్‌ఫోన్లు, బంగారు చైన్లు దొంగిలించారు.

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 04:34 PM IST

HYDERABAD: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. చెప్పినట్టుగానే శ్రీరామనవమి శోభాయాత్ర గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ శోభాయాత్రకు సిటీ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా శ్రీరామ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. యాత్రకు పర్మిషన్‌ లేదు అని పోలీసులు చెప్పినప్పటికీ యాత్ర చేసి చూపించారు రాజాసింగ్‌. నిజానికి 60 రోజుల ముందే యాత్ర అనుమతి కోసం పోలీసులకు రాజాసింగ్‌ లెటర్‌ రాశారు.

Kim Jong Un: కిమ్ గాడికి మనసుంది…! ఆడికో గర్ల్ ఫ్రెండ్ ఉంది !!

కానీ వాళ్ల నుంచి చాలా ఆలస్యంగా రిప్లై రావడంతో యాత్ర ఉంటుందా లేదా అనే టెన్షన్‌ చాలా మందిలో కలిగింది. కానీ ఎట్టకేలకు యాత్ర నిర్వహించారు రాజాసింగ్. ఐతే ఈ యాత్రలో జనం ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. కొందరు భక్తుల ఖరీదైన సెల్‌ఫోన్లు, బంగారు చైన్లు దొంగిలించారు. తన ఫోన్‌, పర్స్‌ పోయిందంటూ ఓ వ్యక్తి మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత వరుసగా మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బాధితులు క్యూ కట్టారు. ఫోన్లు పోయానని కొందరు, బంగారు చైన్లు పోయాయని ఇంకొందరు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మొత్తం 18 మంది ఫోన్లు, 9 మంది బంగారు చైన్లు చోరీకి గురైనట్టు పోలీసులు చెప్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉందని కూడా చెప్తున్నారు.

ఇలా క్రౌడ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నార్మల్‌గానే జేబు దొంగలు రెచ్చిపోతుంటారు. అందులోనూ శ్రీరామ శోభాయాత్ర కావడంతో ఇక వాళ్లకు అడ్డుఅదుపూ లేకుండా పోయాయి. ఇప్పటికైనా ఇలాంటి ర్యాలీల్లో ప్రజలు దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు.