కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం హత్యకు గురైన యువ డాక్టర్ మౌమిత తల్లి తండ్రులు జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మౌమిత తండ్రి మాట్లాడుతూ… తన కూతుర్ని అత్యాచారం చేసింది ఒక్కడు కాదు, ఇది ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా.. ఒకరి వల్ల సాధ్యం కాదని అన్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు.
మొదట్లో నాకు మమతా బెనర్జీపై పూర్తి నమ్మకం ఉండేది కాని ఇప్పుడు లేదు. ఆమె న్యాయం అడుగుతుంది, కాని ఏం చెప్పాలనుకుంటుంది అంటూ ఆయన ప్రశ్నించారు. న్యాయం చేసే బాధ్యత ఆమె తీసుకోవచ్చు కదా…? అని నిలదీశారు. సిబిఐ తన పని తాను చేస్తుంది అంటూ మౌమిత తండ్రి వ్యాఖ్యానించారు. అలాగే తల్లిదండ్రులుగా, మా బిడ్డ రోడ్డు మీద ఉన్నప్పుడు మేము ఆందోళన చెందుతాము, కాని వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ భయం ఉండదు. కాలేజి లోపల ఉంటే సేఫ్ అనుకుని వదిలేస్తాం. కాని అక్కడ కూడా నా కూతురుకి భద్రత లేకుండా పోయింది అంటూ ఆయన కామెంట్ చేసారు.
రోడ్లు పెద్దగా ఉన్నాయని తన కూతురి కోసం ఒక కారు కూడా కొన్నామని అన్నారు. ఇక మౌమిత తల్లి మాట్లాడుతూ మమతా బెనర్జీ పథకాలన్నీ – కన్యాశ్రీ పథకం- లక్ష్మి పథకం — అన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో, వాటిని పొందే ముందు దయచేసి మీ ఇంట్లో లక్ష్మి భద్రంగా ఉందో లేదో చూసుకోండి అంటూ కామెంట్ చేసారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడుని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు విచారించినప్పుడు తానే ఈ నేరం చేశా అని కావాలంటే ఉరి తీసుకోండి అంటూ చెప్పినట్టుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు.