GUNTUR: గయ్యాళి భార్య.. గందరగోళ పడిన కుటుంబం.. అనుమానాస్పదంగా చనిపోయిన భర్త.. ఏపీసీఐడీ చేతికి కేసు.. ముక్కలుగా చెప్పాలంటే ఇదీ సంగతి. గుంటూరు జిల్లాకు చెందిన గంగూరి శ్రీనాథ్ అనే యువకుడు.. అమెరికాలో ఏడాది క్రితం చనిపోయాడు. ఐతే శ్రీనాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని.. ఆయన తండ్రి బాబూరావు ఇప్పుడు ఏపీ సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో శ్రీనాథ్ భార్య సాయిచరణి, మామ సుఖవాసి శ్రీనివాసరావు, అత్త రాజశ్రీని నిందితులుగా చేరుస్తూ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడి మరణంపై అన్ని రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు.. అనుమానాస్పద మరణంగా నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
Visakhapatnam: ఉలిక్కిపడ్డ విశాఖ.. ఇండస్ హాస్పిటల్ ప్రమాదానికి కారణం ఇదే..
ఐతే శ్రీనాథ్ అత్తవారింటి నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు రావడంతో ఆ సమయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఐతే సన్నిహితులు, న్యాయవాదుల సలహాతో ఇప్పుడు సీఐడీ పోలీసులను ఆశ్రయించారు. శ్రీనాథ్, సాయి చరణికి 2016 డిసెంబర్‌లో పెళ్లి జరిగింది. 2017 జనవరిలో భార్యాభర్తలు అమెరికా వెళ్లారు. పెళ్లి సమయానికే వర్జీనియాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనాధ్.. తన భార్యను డిపెండెంట్ వీసా మీద తీసుకెళ్లారు. ఐతే అక్కడికి వెళ్లిన కొద్దిరోజులకే తనకు పెళ్లి ఇష్టం లేదని.. తల్లిదండ్రుల బలవంతం మీదే ఒప్పుకోవాల్సి వచ్చిందని సాయిచరణి గొడవలకు దిగడం ప్రారంభించింది. ఎప్పటికైనా నిన్ను చంపేస్తాను అంటూ శ్రీనాథ్‌ను బెదిరించేది. కొడుకు ద్వారా విషయం తెలుసుకున్న బాబూరావు వియ్యంకుడితో చర్చించారు. ఐతే చరణితో మాట్లాడామని.. అంతా సెట్ అంటూ ఆ టైమ్‌లో సుఖవాసి శ్రీనివాసరావు చెప్పారు. ఆ తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న సాయిచరణి.. ఆ తర్వాత మళ్లీ వింతగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
కత్తితో చేయి కోసుకుంటానని బెదిరించడం.. అమెరికాలో రాంగ్ రూట్‌లో వెళ్తూ కారును యాక్సిడెంట్ చేసింది. 2019లో బంధువుల పెళ్లికి భర్తతో కలిసి గుంటూరు వచ్చిన చరణి.. ఆ సమయంలో ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఫ్లైట్‌లో ఆడపడుచు ఫ్యామిలీ పక్కన సీటు వచ్చిందని.. బోర్డింగ్ అయిన విమానం నుంచి దిగిపోయింది. ఆ తర్వాత వారం రోజులకు శ్రీనాథ్, సాయిచరణి మళ్లీ అమెరికా వెళ్లారు. ముందు పెళ్లి ఇష్టం లేదని చెప్పిన చరణి.. ఆ తర్వాత పిల్లలు పుట్టకుండా మందులు వాడడం మొదలుపెట్టింది. పిల్లలు పుడితే తన అందం తగ్గుతుందని భర్తతో చెప్పిన చరణి.. తనకు పెళ్లి కాలేదంటూ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. ఇదంతా ఇలా ఉంటే.. గతేడాది అక్టోబర్ 16న అత్తామామలకు ఫోన్ చేసిన చరణి.. శ్రీనాథ్ చనిపోయాడని చెప్పింది. దీంతో షాక్ అయిన శ్రీనాథ్ తల్లిదండ్రులు.. వియ్యంకుడు సుఖవాసి శ్రీనివాసరావుతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే శ్రీనాథ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ సంస్కారాలకు హాజరుకాని చరణి.. తండ్రితో పాటు అత్తామామలను కూడా ఇంట్లోకి రానివ్వలేదు.
శ్రీనాథ్ ఎలా చనిపోయాడని అడిగితే.. ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు కాలు జారి లోయలో పడిపోయాడని చెప్పింది. ఐతే దీనిపై అనుమానం వ్యక్తం చేసిన శ్రీనాథ్ తల్లిదండ్రులు.. అమెరికాలోనే కొద్దిరోజులు ఉండి అతని మరణంపై ఆరా తీశారు. ఐతే వాళ్లను బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చిన చరణి తల్లిదండ్రులు.. శ్రీనాథ్ పేరెంట్స్‌ను ఇండియాకు పంపించేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న శ్రీనాథ్ తండ్రి బాబూరావు ఇప్పుడు ఏపీసీఐడీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో ఏం తేలుతుందన్నది టెన్షన్ పుట్టిస్తోంది.