INSTAGRAM REELS: సోషల్ మీడియా వచ్చిన తరువాత తేడా బ్యాచ్ కౌంట్ పెరిగిపోయింది. ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యేందుకు వింత వింత వేషాలు వేస్తున్నారు చాలా మంది. ఏదో ఓ తిక్క పని చేసైనా సరే.. నెట్‌లో వైరల్ ఐపోవాలని చూస్తున్నారు. టిక్‌టాక్ బ్యాన్ చేసిన తరువాత ఇలాంటి వీడియోలు తగ్గుతాయనుకున్నాం. కానీ ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ మీద పడ్డారు వీళ్లంతా. తమ విజ్ఞానాన్ని మొత్తం ప్రదర్శిస్తూ రీల్స్ చేస్తున్నారు.
PAWAN KALYAN: ఆ రెండు సీట్లే ఎందుకు..? గెలుపు ఖాయమా..? పవన్ అందుకే ప్రకటించాడా..?
చూసేందుకు సరదాగా ఉన్నా.. అప్పుడప్పుడు ఈ రీల్స్ ఎక్కడలేని కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. ఈ రీలే దీనికి ఎగ్జాంపుల్. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హన్మంతు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యేందుకు ఓ రీల్ చేశాడు. డీమార్ట్ లోపల ఏదీ తినడానికి, తాగడానికి అనుమతి ఉండదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. అదే డీమార్ట్‌లో చాక్లెట్ తినాలంటే ఎలా అనే విషయంలో సమాజానికి నాలెడ్జ్ ఇచ్చేందుకు ఓ వీడియో తీశాడు. డీమార్ట్ వెళ్లి.. ఓ షర్ట్ తీసుకుని.. ఓ చాక్లెట్ ఆ షర్ట్‌లో పెట్టి.. ట్రయల్ రూంకు వెళ్లి చాక్లెట్ తినేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అరె.. ఈ ట్రిక్ చాలా బాగుందే అంటూ షేర్ల మీద షేర్లు కొట్టేశారు నెటిజన్లు. ఇలా అందరికీ వెళ్తూ ఆ వీడియో కాస్త పోలీసుల కంట్లో పడింది. డీమార్ట్‌లో దొంగతనంగా చాక్లెట్ తిన్న హన్మంతును టార్గెట్ చేశారు. వీడియోద్వారా ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడో కనుక్కుని అరెస్ట్ చేశారు.
రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హన్మంతు నాయక్‌ను లోపలేశారు. హన్మంతు చేసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో ఇప్పుడు ఈ విషయం కూడా అంతే వైరల్ అవుతోంది. ఫ్రీగా చాక్లెట్ కావాలా.. ఇప్పుడు తిక్క కుదిరిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు బాగా అయ్యిందా అంటూ ఆడేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఫేమస్ కావాలనే ఆరాటంలో తెలియకుండా క్రైమ్ చేశాడు హన్మంతు నాయక్. ఆ క్రైమ్‌ను తానే పోస్ట్ కూడా చేసి కటకటాల్లోకి వెళ్లాడు పాపం. ఈ ఇన్సిడెంట్ చూసైనా ఇలాంటి వీడియోలు చేసే రీల్స్ బ్యాచ్‌కు బుద్ధి రావాలి అంటున్నారు పోలీసులు.