Hyderabad: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. మహిళలు అరెస్టు..

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని రాడిసన్ హోటల్‌లో సింగిడి శ్రీనివాస్ అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. అతడు ఆన్‌లైన్‌లో బుకింగ్స్ చేసి, హోటల్‌లో నేరుగా పేకాట ఆడిస్తున్నాడు. డబ్బులు ఉన్న వాళ్లని గుర్తించి, ఒక గ్యాంగులా ఏర్పడి పేకాట నిర్వహిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 07:22 PM IST

Hyderabad: హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి, 13 మందిని అరెస్టు చేశారు. అందులో పలువురు మహిళలు కూడా ఉన్నారు. పేకాట నిర్వహిస్తున్న నిందితుడు.. తన దగ్గరకు వచ్చే కస్టమర్లను మోసం చేసేందుకు హైటెక్ టెక్నాలజీ వాడుతుండటం తెలిసి, పోలీసులు షాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని రాడిసన్ హోటల్‌లో సింగిడి శ్రీనివాస్ అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు.

CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. భద్రతా సిబ్బందిలో మార్పులు

అతడు ఆన్‌లైన్‌లో బుకింగ్స్ చేసి, హోటల్‌లో నేరుగా పేకాట ఆడిస్తున్నాడు. డబ్బులు ఉన్న వాళ్లని గుర్తించి, ఒక గ్యాంగులా ఏర్పడి పేకాట నిర్వహిస్తున్నాడు. తన మనుషులతో డమ్మీ పేకాట ఆడించి, డబ్బులున్న వారి దగ్గరి నుంచి భారీగా నగదు కొట్టేస్తున్నాడు సింగిడి శ్రీనివాస్. నలుగురు వ్యక్తుల నుంచి ఇలా లక్షల రూపాయలు కాజేశాడు. తన వాళ్లను తొమ్మిది మందిని పెట్టించి, డమ్మీ పేకాట ఆడిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వారిని మోసం చేసేందుకు అధునాతన గాగుల్స్, సెన్సర్లను వినియోగిస్తున్నాడు. పేక ముక్కల్లో సెన్సర్లు పెట్టి, మోసానికి పాల్పడుతున్నాడు. ఇది తెలియక అతడిదగ్గర పేకాట ఆడి లక్షలు పోగొట్టుకుంటున్నారు.

ఈ అంశంపై పోలీసులకు సమాచారం అందడంతో.. హోటల్‌పై దాడి చేసి, పేకాట ఆడుతున్న వాళ్లను, నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది పేకాట రాయుళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల దగ్గరి నుంచి రూ.32 లక్షల విలువైన కూపన్లతో పాటు నగదును స్వాదీనం చేసుకున్నారు. డమ్మీ కూపన్లు, క్యాసినో కాయిన్స్‌ని స్వాధీనపరచుకున్నారు. కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.