Hyderabad Case: హిందువులను ముస్లింలుగా మార్చి.. కేరళ స్టోరీని తలపిస్తున్న హైదరాబాద్ ఉగ్రకోణం కేసు..

కేరళ స్టోరీ సినిమా మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సినిమాలో ముస్లింలని దేశ ద్రోహులుగా చూపే ప్రయత్నం చేశారంటూ అంత సినిమాను వ్యతిరేకిస్తున్నారు. చాల రాష్ట్రాల్లో సినిమాను బ్యాన్ చేసారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉగ్ర కోణం కేసులో కేరళ స్టోరీ సీన్ రిపీట్ అయింది.

భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్ర దారిగా పోలీసులు గుర్తించారు. యాసిర్ ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు హిందువులకు ఇస్లాంలోకి మార్చినట్లు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సౌరబ్ రాజ్ విద్యను మహ్మద్ సలీంగా, దేవి ప్రసాద్ పండా ను అబ్దుల్ రెహ్మాన్ గా, బస్కా వేణు కుమార్ ను మహమ్మద్ అబ్బాస్ అలీ మార్చాడు యాసిర్. అతని ట్రాప్ లో మొత్తం 17 మంది ఉన్నట్లుగా గుర్తించి అధికారులు షాక్‌ తిన్నారు.

భోపాల్‌ కు చెందిన16 మందిని హైదరాబాదులో అరెస్ట్ చేశారు. సలీం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం సలీం అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. యాసిన్ వీళ్ళందరికీ హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో శిక్షణ ఇచ్చి, పూల్ తరహాలో దాడులకు ప్లాన్ వేశాడు. ఎవరికి వారే సింగిల్ గా దాడులు చేయాలని ప్లాన్ లు వేసుకున్నారు. హైదరాబాదులో కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా రెక్కి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యాసిర్ బృందం తుపాకులు, కత్తులు, గొడ్డలి, ఎయిర్‌ పిస్టల్, పిల్లోట్ ని కొనుగోలు చేసుకున్నట్లు గుర్తించారు.

హైదరాబాదులో అరెస్టు చేసిన ఐదుగురిని భోపాల్ కు తరలించారు పోలీసులు. వీళ్ళందరు హిజ్బ్ ఉత్ తహరీర్ అనే సంస్థతో సంబంధాలు పెట్టుకున్న గుర్తించారు. ఐదుగురు కలిసి నగరంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి.

భోపాల్ కు చెందిన మరి కొంత మంది నగరానికి వచ్చి విధ్వంసం చేసేందుకు ప్లాన్ వేసినట్లు గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో భోపాల్ ఏటిఎస్, తెలంగాణా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా ఏర్పాటు చేశారు. అరెస్టైన వారి నుండి ఎయిర్ గన్స్, రివాల్వర్, కత్తులు, జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అబ్బా సాలి అరెస్టుతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వారి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైన అనుమానితులు కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.