Inter student suicid : ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు.. నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

దేశ వ్యాప్తంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. మొన్నటి వరకు రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్ లో వరుస విద్యార్థుల మరణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

దేశ వ్యాప్తంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. మొన్నటి వరకు రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్ లో వరుస విద్యార్థుల మరణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపింది తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

హైదరాబాద్ చైతన్యపురిలోని నారాయణ కాలేజ్ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మంచాల వైభవ్ (16) సూసైడ్ నోట్ రాసి మీర్ పేట జిల్లెలగూడలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.కాలేజ్ టీచర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ యాజమాన్యం వేధింపులే తన చావుకు కారణమని.. ఒత్తిడి భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, సూసైడ్ నోట్ రాశాడు మంచాల వైభవ్.

“అమ్మానాన్న తనను క్షమించాలని కోరుతూ తమ్ముడిని మంచి కాలేజీలో జాయిన్ చేయాలని కోరాడు. ఎక్కువ మార్కుల కోసం కాలేజ్ టీచర్, యాజమాన్యం స్టూడెంట్స్ పై ఒత్తిడి చేయవద్దని లేఖలో తెలిపాడు. అందరూ నన్ను క్షమించాలని. ఇదే తన చివరి రోజు అని లెటర్ రాశాడు. విద్యార్థి వైభవ్ ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.