New Cyber Crime: బ్యాంక్‌ నుంచి కాల్స్‌ వస్తున్నాయా.. కాస్త జాగ్రత్తగా ఉండండి..

ఒకప్పుడు ఇంటర్నెట్‌ను బేస్‌ చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కాల్స్‌లో కూడా మాయ చేసి మనీ దోచేస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 28, 2023 / 01:20 PM IST

టెక్నాలజీ పెరగడం ఏంటో కానీ మనుషులకు సెక్యూరిటీ లేకుండా పోతోంది. ఒకప్పుడు ఇంటర్నెట్‌ను బేస్‌ చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు కాల్స్‌లో కూడా మాయ చేసి మనీ దోచేస్తున్నారు. ఒక సాఫ్ట్‌వేర్‌ కాకపోతే మరో సాఫ్ట్‌వేర్‌ వాడుతూ దోచేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వీఓఐపీ ఉపయోగించి మోసాలు చేస్తున్నారు. వీఓఐపీ అంటే వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌. దీన్ని ఉపయోగించి.. కావాల్సిన నెంబర్‌ నుంచి ఫోన్లు చేయోచ్చు. మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో అవతలి వ్యక్తి కనిపెట్టలేడు. మన నెంబర్‌ కూడా అవతలి వ్యక్తికి కనిపించదు. నిజం చెప్పాలంటే అసలు నెంబరే ఉండదు. పని అంతా కంప్యూటర్‌ ద్వారా అయిపోతుంది.

నార్మల్‌గా ఫోన్ల ద్వారా మోసాలు చేస్తే వెంటనే కాకపోయినా కొన్ని రోజులకు దొరికే ఛాన్స్‌ ఉండేది. కానీ ఈ వీఓఐపీ ద్వారా మోసాలు చేస్తున్న నేరగాళ్లను గుర్తించడం కష్టంగా మారింది. ఎందుకంటే సర్వీస్‌ ప్రొవైడర్‌ ఏంటి, కాల్‌ చేసేది ఎవరు అనే వివరాలు ట్రేజ్‌ అవ్వవు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను రెండు నెలల క్రితం అరెస్ట్‌ చేశారు పోలీసులు. అమెరికన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఎఫ్‌బీఐ నెంబర్లతో కొందరికి ఫోన్లు చేశారు నేరగాళ్లు. కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేయడం వీళ్ల జాబ్‌. దీనికోసం సెపరేట్‌గా ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 115 మంది అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వీఓఐపీ ద్వారా నిందితులు మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. దీన్ని గుర్తించేందుకు, కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు దగ్గర ఇంకా ఎలాంటి టెక్నాలజీ లేదు. ప్రస్తుతానికి మనం జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం. పోలీసులు కానీ బ్యాంక్‌ వాళ్లు గానీ ఫోన్‌ చేసి ఎలాంటి వివరాలు అడిగినా ఇవ్వకపోవడం బెటర్‌ అంటున్నారు టెక్‌ నిపుణులు. అనుమానాస్పదంగా అనిపించే కాల్స్‌ను వెంటనే కట్‌ చేయడం బెటర్‌. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మొదటికే మోసం వస్తుంది.