Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం పత్రాల విడుదల.. లిస్టులో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు

ఈ పేర్లన్నీ ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నాయి. ఆమె ఇందులో ఎప్‌స్టీన్‌తోపాటు పలువురిపై ఆరోపణలు చేశారు. ఎప్‌స్టీన్‌‌కు చెందిన ఒక విల్లాలో తాను మైకేల్ జాక్సన్‌ను కలిశానని, ఆయన తనతో మర్యాదగానే నడుచుకున్నారని సోబెర్గ్ పేర్కొంది.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 05:24 PM IST

Jeffrey Epstein: అగ్రరాజ్యం అమెరికాను వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా కొన్ని రహస్య పత్రాలు విడుదలయ్యాయి. న్యూయార్క్ కోర్టు వీటిని తాజాగా బయటపెట్టింది. ఈ పత్రాల్లో ఈ కేసుకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల స్టేట్‌మెంట్లు వంటివన్నీ ఉన్నాయి. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూతోపాటు దివంగత పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ పేరు కూడా ఉంది.

REVANTH REDDY: మహిళలకు రేవంత్‌ శుభవార్త.. రూ.2500 అప్పటి నుంచే..

మొత్తం వంద మందికిపైగా పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్నాయి. ఆమె ఇందులో ఎప్‌స్టీన్‌తోపాటు పలువురిపై ఆరోపణలు చేశారు. ఎప్‌స్టీన్‌‌కు చెందిన ఒక విల్లాలో తాను మైకేల్ జాక్సన్‌ను కలిశానని, ఆయన తనతో మర్యాదగానే నడుచుకున్నారని సోబెర్గ్ పేర్కొంది. అయితే, బ్రిటన్ ప్రిన్స్ కుటంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ మాత్రం తనను అసభ్యంగా తాకారని చెప్పింది. అలాగే ఒకసారి డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన క్యాసినోలో గడిపానని, కానీ, అక్కడ ట్రంప్ కలవలేదని ఆమె తెలిపింది. అలాగే బిల్ క్లింటన్‌ను కూడా ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని పేర్కొంది.
ఏంటీ కుంభకోణం..
వ్యాపారవేత్త అయిన ఎప్‌స్టీన్‌ పేద, మధ్య తరగతికి చెందిన బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి తన విల్లాకు రప్పించుకుని అత్యాచారాలకు పాల్పడేవాడు. అలా ఒకసారి వచ్చిన వారికి.. కొంత డబ్బు ఇచ్చి.. తమ స్నేహితుల్ని కూడా తీసుకొస్తే ఇంకాస్త డబ్బిస్తానని ఆశ చూపేవాడు. అలా ఒకరి ద్వారా ఇంకొకరిని.. గొలుసుకట్టు విధానంలో లైంగిక దాడులకు పాల్పడ్డాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఈ వ్యవహారం సాగింది. చివరకు 2005లో బయటపడింది. ఈ కేసులో పలుసార్లు అతడు అరెస్టయ్యాడు. అనంతరం ఈ కేసు విచారణ సాగుతుండగానే 2019లో జైల్లోనే ఎప్‌స్టీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి కేసుకు సంబంధించిన పత్రాలే ఇప్పుడు విడుదలయ్యాయి.