Varthur Santosh: బిస్‌బాగ్ షోకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ షో చూసేవాళ్ల సంఖ్య కంటిన్యూగా పెరుగుతోంది. గేమ్‌లో వచ్చే ట్విస్ట్‌లు, టాస్క్‌లకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కానీ అదే బిగ్‌బాస్ ఓ కంటెస్టెంట్ కొంప ముంచింది. జైలుపాలు అయ్యేలా చేసింది. బయటి వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకున్నారేమో.. ఏకంగా బిగ్‌బాస్ హౌజ్‌కు వెళ్లి మరీ కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇది జరిగింది తెలుగు బిగ్‌బాస్‌లో కాదు. కన్నడ బిగ్‌బాస్‌లో.
కన్నడలో కూడా ఇప్పుడు బిగ్‌బాస్ షో నడుస్తోంది. ఈ షోలో వర్తుర్ సంతోష్ అనే వ్యక్తి కంటెస్టెంట్‌గా ఉన్నాడు. రీసెంట్‌గా సంతోష్ ఓ ఎపిసోడ్‌లో పులిగోరు ఉన్న చైన్ వేసుకున్నాడు. ఆ ఎపిసోడ్ అటుఇటూ తిరిగి ఫారెస్ట్ ఆఫీసర్స్ కళ్లలో పడింది. దీంతో సంతోష్ మెడలో ఉన్న పులిగోరు నిజమైనదేనా, లేక నకిలీదా అనే అనుమానం వచ్చింది ఫారెస్ట్ అధికారులకు. వెంటనే బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించి ఆ గోరును తెప్పించారు. దానిపై పరీక్షలు కూడా జరిపారు. ఆ పరీక్షలో ఆ పులిగోరు నిజమైనదని తేలడంతో సంతోష్‌ను అరెస్ట్ చేయాని నిర్ణయించారు. పులిగోరు తీసుకునేందుకు ఎలాంటి అనుమతులు సంతోష్ దగ్గర లేవని అధికారులు గుర్తించారు. వెంటనే బిగ్‌బాస్ షోకు వెళ్లి మరీ సంతోష్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే సంతోష్ ఉన్నాడు. ఆ పులిగోరు ఎలా వచ్చింది..? ఎవరు అమ్మారు..? ఎక్కడి నుంచి ఆ గోరును సంపాదించారు. ఇలాంటి విషయాలపై ప్రస్తుతం సంతోష్‌ను విచారిస్తున్నారు పోలీసులు.
సంతోష్ ఆలిండియా గోసంరక్షణ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. జంతువులను సంరక్షించే బాధ్యతలో ఉండి మరో జంతువు గోరు మెడలో వేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే చాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు కర్నాటకలో హాట్‌టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ షో ఏమోగానీ స్టైల్‌కి పోయి జైలుపాలయ్యాడు సంతోష్.