Lasya Nanditha: నలుగురితో కలిసి వెళ్తే.. ఇద్దరికే ప్రమాదం.. యాక్సిడెంట్‌‌కు ముందు అసలేం జరిగింది

సదాశివపేట వెళ్లారని ఒకరు.. బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె మరణంపై మరిన్ని అనుమానాలు అలుముకున్నాయ్. ఐతే యాక్సిడెంట్‌కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.

  • Written By:
  • Updated On - February 23, 2024 / 01:54 PM IST

Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఆమె మరణం వెనక చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అసలు ఆమె కారు ప్రమాదం ఎలా జరిగింది.. తెల్లవారుజామునే ఆమె ఎక్కడికి వెళ్లారనే విషయాలు చాలామందిని ఆలోచనలో పడేస్తున్నాయ్.

Sundaram Master Review: హర్ష మెప్పించాడా.. సుందరం మాస్టర్ రివ్యూ..

సదాశివపేట వెళ్లారని ఒకరు.. బాసర నుంచి తిరుగొస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె మరణంపై మరిన్ని అనుమానాలు అలుముకున్నాయ్. ఐతే యాక్సిడెంట్‌కు ముందు ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రమాదానికి ముందు లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మిస్కిన్ బాబా దర్గాకు వెళ్లినట్లు సమాచారం. ఈ దర్గాకు అర్ధరాత్రి సుమారు పన్నెండున్నరకు వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. మొక్కులు తీర్చుకున్న తర్వాత ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. కొబ్బరికాయలు కొట్టి దర్గా దగ్గర ప్రార్ధనలు చేశారని.. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చొని వెళ్లిపోయారు అంటున్నారు. ఆ సమయంలో లాస్య కారులో నలుగురైదుగురు ఉన్నట్లు చెప్తున్నారు.

ఐతే ప్రమాదం జరిగినప్పుడు.. కారులో డ్రైవర్‌తో పాటు లాస్య మాత్రమే ఉన్నారు. ఐతే ప్రత్యక్ష సాక్షులు నలుగురైదుగురు వచ్చారని చెప్తుంటే.. మిగిలిన వ్యక్తులు ఎక్కడికి వెళ్లారు. అసలు డ్రైవర్‌తో కలిసి అంత వేగంగా లాస్య నందిత ఎందుకు ప్రయాణం చేసినట్లు.. దర్గా నుంచి బయల్దేరిన తర్వాత.. ప్రమాదానికి ముందు.. మధ్యలో ఏం జరిగింది.. లాస్య ఎవరిని కలిశారు.. ఏ విషయం తెలిసి అంత వేగంగా వచ్చారు. ఇలా సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయ్. డ్రైవర్‌ నోరు విప్పితే తప్ప.. ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు.