Inhuman: మెడకు తాడు.. కుక్కలా మొరగాలంటూ వేధింపులు.. మతం మార్చుకో అంటూ పిచ్చి చేష్టలు! ఎక్కడో తెలుసా?

అతని పేరు విజయ్ రామచందాని. సోషల్‌ మీడియాలో ఏదో పోస్టు చేశాడు. అది చూసిన సమీర్, సాజిద్, ఫైజాన్‌కు ఒళ్లు మండింది. అంతే విజయ్ రామచందాని ఇంటికి వెళ్లారు. అతన్ని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. క్షమాపణ చెప్పాలంటూ బలవంతం చేశారు.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 08:44 AM IST

Inhuman: సోషల్‌ మీడియాలో తమ మతానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడంటూ ఓ వ్యక్తిని కుక్క లాగా ట్రీట్ చేశారు మతోన్మాదులు. మెడకు కుక్క తాడు కట్టి, మొరగాలంటూ వేధించారు.
మనుషులమన్న విషయం మరుస్తున్నారు. మానవత్వం మరిచి దుర్మార్గులుగా మారుతున్నారు. మతం కోసం కటకటాల పాలవడానికి కూడా వెనకాడటం లేదు పిచ్చోళ్లు. మతమే ముఖ్యమని, మతమే సర్వస్వమని, తమ మతం జోలికి వస్తే ఊరుకోబోమని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో అలాంటి అమానుష ఘటనే వెలుగులోకి వచ్చింది.
కుక్కలా మొరగాలంటూ వేధింపులు
అతని పేరు విజయ్ రామచందాని. సోషల్‌ మీడియాలో ఏదో పోస్టు చేశాడు. అది చూసిన సమీర్, సాజిద్, ఫైజాన్‌కు ఒళ్లు మండింది. అంతే విజయ్ రామచందాని ఇంటికి వెళ్లారు. అతన్ని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. క్షమాపణ చెప్పాలంటూ బలవంతం చేశారు. అంతటితో ఆగలేదు. కుక్కకు కట్టే తాడును తీసుకొచ్చారు. రామచందాని మెడకు దాన్ని కట్టారు. కుక్కలాగా మొరగాలంటూ పైశాచిక ఆనందం పొందారు. అతను ఆ పని చేసేవరకు వదల్లేదు. అక్కడితో కూడా ఆగలేదు.. బీఫ్‌ తినాలని.. మతం మారాలంటూ సైకో డైలాగులు పేల్చారు. ఈ పిచ్చి చేష్టలకు గర్వంగా నవ్వుకున్నారు.
ప్రభుత్వం సీరియస్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా పోలీసులను ఆదేశించడంతో నిందితులను అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుర్మార్గులపై మత స్వేచ్ఛ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో నేర చరిత్ర కలిగిన ముగ్గురు నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగించారు పోలీసులు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆదేశించినట్టు సమాచారం.

నిందితుడి ఇల్లు కూల్చివేత

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ ఖాన్ నివాసాన్ని పోలీసుల సమక్షంలో స్థానిక యంత్రాంగం కూల్చివేసింది. ఇనుప పనిముట్లతో గోడలను నేలమట్టం చేశారు. మరోవైపు నిందితులపై అనేక కేసులు ఇప్పటికే ఉన్నట్టు సమాచారం. ఇంటి ఆక్రమణ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే సమీర్ ఖాన్ నివాసాన్ని కూల్చినట్టుగా భావిస్తున్నారు. అటు విజయ్ రామచందాని కూడా మతానికి వ్యతిరేకంగా పోస్టు చేయలేదు. నిందితుల్లో ఒకరిని తిడుతూ పోస్ట్ పెట్టాడు. కానీ వాళ్లు మాత్రం మతం మారాలంటూ బెదిరించారు. బీఫ్‌ తినాలంటూ వేధించారు.