Manja Kite: ప్రాణాలు తీస్తున్న గాలిపటాలు.. 3 రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే..

నాలుగు రోజుల్లో ఏకంగా పది మంది మాంజా దారాలకు బలయ్యారు. నిషేధిత మాంజా అమ్మకూడదంటూ పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా ఫలితం ఉండటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడా.. ఇక్కడా.. అమ్ముతున్న మాంజా దారాలు ప్రజలకు యమపాశాలుగా మారుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 05:36 PM IST

Manja Kite: పండుగపూట పతంగుల దారాలు ప్రణాలు తీస్తున్నాయి. ఉత్తి పుణ్యానికి అమాయకులు కుత్తుకలు కోస్తున్నాయి గాలిపటాలు. నాలుగు రోజుల్లో ఏకంగా పది మంది మాంజా దారాలకు బలయ్యారు. నిషేధిత మాంజా అమ్మకూడదంటూ పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నా ఫలితం ఉండటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడా.. ఇక్కడా.. అమ్ముతున్న మాంజా దారాలు ప్రజలకు యమపాశాలుగా మారుతున్నాయి.

YS JAGAN Vs SHARMILA: షర్మిలకు పీసీసీ పదవి.. జగన్‌కు నష్టమేనా..?

గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. మాంజా దారాలు వాడొద్దని పోలీసులు ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్లు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు నీళ్ల మీద రాతలుగానే మారిపోతున్నాయి. పతంగుల సంబరంలో చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. పతంగుల మాంజా దారాలు మెడకు చుట్టుకుని ఇంకొందరు చనిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో పది ప్రణాలు పోయాయి. లంగర్‌ హౌజ్‌లో మాంజాదారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్‌ కోటేశ్వర్‌ రెడ్డి చనిపోయాడు. జోగిపేటలో పిల్లల గాలిపటం తొలగించబోయి ఓ తండ్రి చనిపోయాడు. సేట్‌ బషీరాబాద్‌లో ఓ యువకుడు కూడా గాలిపటాలు ఎగరేస్తూ చనిపోయాడు. నాగోల్‌లో 14ఏళ్ల బాలుడు శివప్రసన్న కూడా గాలిపటాల సంబరంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక రాజేంద్రనగర్‌లో తనిష్క్‌ అనే బాలుడు కూడా చనిపోయాడు.

కరెంట్‌ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని బయటికి తీయబోయి.. కరెంట్‌ షాక్‌ తగిలి వివేక్‌ అనే బాలుడు చనిపోయాడు. మైలార్‌దేవ్‌పల్లిలో 9 ఏళ్ల బాలుడు కూడా గాలిపటాలు ఎగరేస్తూ ప్రణాలు కోల్పోయాడు. ఇలా రోజు గాలిపటాల కారణంగా ప్రాణాలు పోవడం ఆందోళనకరంగా మారింది. గాలిపటాలు బిల్డింగ్‌లపై కాకుండా గ్రౌండ్‌లో ఎగరేయాలంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక.. మాంజాలు అమ్మినా కొన్న కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.