Mr Tea Naveen Reddy: మీకు మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి గుర్తున్నాడా..? ప్రేమించిన అమ్మాయిని సినిమా రేంజ్‌లో కిడ్నాప్ చేయబోయి అప్పట్లో జైలుపాలు అయ్యాడు. మనోడు చేసిన తతంగం తెలుగు స్టేట్స్‌లో కొన్ని రోజుల పాటు హాట్‌టాపిక్‌గా మారింది. అదే నవీన్ రెడ్డిపై ఇప్పుడు ఎటాక్ జరిగింది. హస్తినపురంలో ముగ్గురు వ్యక్తులు నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారు. ఓ టీ స్టాల్ దగ్గర నవీన్ ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతని మీద ఎటాక్ చేశారు.
JANASENA: జనసేనకు ఈసీ భారీ షాక్.. పవన్ సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?
స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఎటాక్‌లో నవీన్ భుజానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న హాస్పిటల్‌లో నవీన్ రెడ్డిని జాయిన్ చేశారు స్థానికులు. ఈ ఎటాక్‌కు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారించారు. రాము అనే వ్యక్తితో తనకు కొంత కాలంగా డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయింటూ చెప్పారు నవీన్. దీంతో.. అతనే ఈ ఎటాక్ చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు సంవత్సరం క్రితం.. ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి రెండు తెలుగు స్టేట్స్‌లో నవీన్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు. ఆదిభట్లలో ఉండే వైశాలి, నవీన్ కొంత కాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తరువాత వైశాలి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవ్వడంతో మనోడు రగిలిపోయాడు. ఓ వంద మందితో నేరుగా వైశాలి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి.. అంతా చూస్తుండగానే వైశాలిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు.
ఈ ఇష్యూ కాస్త గంటలోనే స్టేట్‌వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యింది. వ్యవహారం సీరియస్ అవ్వడంతో వైశాలిని సిటీ ఔట్‌కట్స్‌లో వదిలేసి గోవాకు పారిపోయాడు నవీన్ రెడ్డి. కానీ పోలీసులు మాత్రం గోవాకు వెళ్లి మరీ నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తరువాత కొన్ని రోజులకు బెయిల్ మీద బయటికి వచ్చిన నవీన్ రెడ్డి.. నచ్చిన అమ్మాయిని చూసుకుని, పెళ్లి చేసుకుని ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో ఇలా ఎటాక్ జరగడంతో మరోసారి వార్తల్లోక్కెక్కాడు నవీన్.