Criminal Laws: మహిళల రక్షణకు మరిన్ని చట్టాలు.. ప్రేమ పేరుతో మోసం చేసినా జైలు శిక్షే..!

మహిళల్ని మోసం చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. తన వ్యక్తిగత వివరాలు దాచిపెట్టడం, అంతకుముందే వివాహం జరిగి మళ్లీ మరొకరితో సంబంధం కొనసాగించడం వంటివి చేసినా కూడా ఇదే శిక్ష అమలవుతుంది. అయితే, వీటిని అత్యాచారంగా మాత్రం పరిగణించరు.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 09:04 AM IST

Criminal Laws: దేశంలో మహిళల భద్రత కోసం కేంద్రం మరిన్ని కఠిన చట్టాల్ని రూపొందించబోతుంది. ఇప్పటివరకు పెద్ద నేరంగా పరిగణించని అంశాల్లో కూడా నిందితులకు కఠిన శిక్షలు వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికోసం కొత్తగా కేంద్రం మార్పులు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు దేశంలో అమలవుతున్న ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్), సీఆర్‌పీసీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్), ఐఈఏ(ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్) స్థానాల్లో భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య్ బిల్-2023ని కేంద్రం తీసుకురాబోతుంది. ఈ బిల్లును ఇప్పటికే పార్లమెంటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. వీటి ద్వారా క్రిమినల్ లాలో చాలా మార్పులు జరుగుతాయి.
పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే
చాలా మంది మహిళలు ప్రేమ పేరుతో మగవారి చేతిలో మోసపోతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రమోషన్ ఇప్పిస్తానని, ఇలా ఏదో ఒక రకంగా మాయమాటలు చెప్పి కొందరు మహిళలను లైంగింకంగా వినియోగించుకుంటున్నారు. కొంతకాలం సంబంధం కొనసాగించిన తర్వాత మొహం చాటేస్తున్నారు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో బాధిత మహిళలకు న్యాయం జరగడం లేదు. చాలావరకు ఇలాంటి కేసుల్లో నిందితులకు పెద్దగా శిక్షలు పడటం లేదు. కొత్త బిల్లు అమల్లోకి వస్తే ఇలాంటి వారి ఆటలు చెల్లవు. ఇలా మహిళల్ని మోసం చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. తన వ్యక్తిగత వివరాలు దాచిపెట్టడం, అంతకుముందే వివాహం జరిగి మళ్లీ మరొకరితో సంబంధం కొనసాగించడం వంటివి చేసినా కూడా ఇదే శిక్ష అమలవుతుంది. అయితే, వీటిని అత్యాచారంగా మాత్రం పరిగణించరు. ఇప్పటిదాకా ఇలాంటి ఘటనల్లో నిందితులకు పెద్దగా శిక్షలు పడలేదు. కారణం.. వీటికి ఐపీసీలో సరైన చట్టాలు, నిబంధనలు లేవు. దీంతో చాలా మంది మగవారు ఈ లోపాన్ని అడ్డం పెట్టుకుని, మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలు గర్భం దాలుస్తున్నారు. కానీ, బాధిత మహిళలకు సరైన న్యాయం జరగడం లేదు.
రేప్ చేస్తే మరణశిక్ష
తాజా బిల్లు ప్రకారం.. 16 ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధిస్తారు. కొన్నిసార్లు జీవిత ఖైదు పడొచ్చు. 12 ఏళ్లకంటే తక్కువ వయసున్నవారిపై అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదుతోపాటు జరిమానా కూడా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. 18 ఏళ్లలోపు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష కూడా విధించవచ్చు.