Visakhapatnam: విశాఖలో మద్యం లారీ బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన మందుబాబులు..

స్థానిక కొమ్మది వద్ద జాతీయ రహదారిపై మద్యంలోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని మందు బాటిళ్ల కార్టన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని బాటిళ్లు పగిలిపోయాయి. వెంటనే స్థానికులు.. కిందపడ్డ మందుబాటిళ్ల కోసం ఎగబడ్డారు.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 04:10 PM IST

Visakhapatnam: ఉచితంగా మద్యం దొరికితే మందుబాబులు వదిలేసుకుంటారా..? లేదు కదూ..! ఎంత దొరికితే.. అంత మద్యం కోసం ఎగబడతారు. తాజాగా రోడ్డుపై పడిపోయిన మందుబాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లిన ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో జరిగింది. శనివారం, స్థానిక కొమ్మది వద్ద జాతీయ రహదారిపై మద్యంలోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని మందు బాటిళ్ల కార్టన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని బాటిళ్లు పగిలిపోయాయి. వెంటనే స్థానికులు.. కిందపడ్డ మందుబాటిళ్ల కోసం ఎగబడ్డారు.

JANASENA: జనసేనకు మరో దెబ్బ.. జాతీయ జనసేన పార్టీతో ఓట్ల చీలిక..?

క్వాటర్ బాటిల్స్, బీర్ బాటిల్ బాక్సులు దొరికాయి. దీంతో ఆ మద్యం బాటిళ్లను అందినకాడికి అందినట్టు తీసుకుని వెళ్లారు స్దానికులు. కొందరు బాటిల్స్ తీసుకెళితే.. మరికొందరు బాక్సులకు బాక్సులు ఎత్తుకెళ్ళారు. పదుల సంఖ్యలో గుమిగూడిన స్థానికులు, చేతికి అందిన మందు బాటిళ్లను ఎత్తుకొని పరారయ్యారు. చుట్టుపక్కల నుంచి వెళ్తున్న వాహనదారులు కూడా మద్యం కోసం ఎగబడ్డారు. దీంతో కొంతసేపు రోడ్డుపై గందరగోళ పరిస్థితి తలెత్తింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ విషయం గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడ్డుకుని, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లకుండా చూశారు. కానీ, అప్పటికే చాలా బాటిళ్లను ఎత్తుకెళ్లిపోయారు.