Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్ పెడ్లర్ రెహ్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న రెహమాన్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రెహమాన్ బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. పబ్ కస్టమర్లను టార్గెట్ చేసుకొని.. డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడు రెహ్మాన్. 15మంది ఏజెంట్ల సాయంతో.. పబ్‌ల దగ్గర విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
MLC KAVITHA: భార్య కోసం అనిల్ పోరాటం.. కవిత అనిల్ లవ్‌స్టోరికి ఫిదా అవ్వాల్సిందే..
హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై, బెంగళూరు, ఢిల్లీలోనూ రెహ్మాన్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. గోవా జైలు నుంచి ఫైజల్ అనే వ్యక్తి.. రెహ్మాన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. రాడిసన్ కేసులో కీలక నిందితుడు అయిన గజ్జల వివేకానందకు.. రెహ్మాన్ నుంచే డ్రగ్స్ సప్లయ్ అయ్యాయ్. మీనన్ అనే యువతి ద్వారా.. వివేకానందకు రెహ్మాన్ డ్రగ్స్ చేరవేర్చాడు. ఆ తర్వాత అది బయటపడడంతో.. రెహ్మాన్‌తో పాటు మీనన్ కూడా పరారీలోకి వెళ్లిపోయింది. డ్రగ్స్ అమ్మిన డబ్బులతో రెహ్మాన్ లగ్జరీ కార్లను కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెహ్మాన్‌తో పాటు ఢిల్లీకి చెందిన నరేంద్ర అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ డ్రగ్స్ పార్టీలో మొత్తం 10మంది సినీ సెలబ్రిటీల పేర్లు తెరమీదకు వచ్చాయ్.
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌ను కూడా పోలీసులు ఈ కేసులో ప్రశ్నించారు. మరో ఇద్దరు సెలబ్రిటీలు పరారీలో ఉండగా.. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కేసులో పట్టుబడిన రెహ్మాన్‌కు.. నైజీరియన్లతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది.