HYDERABAD DRUGS CASE: ఈ నగరానికేమైంది.. డ్రగ్స్‌ కేసులో అల్లు అర్జున్ ఫ్రెండ్స్‌.. మొత్తం 9మంది..

వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్‌, అబ్బాస్‌, కేదార్‌నాథ్‌, సందీప్‌, సెల్రబిటీలు శ్వేతతో పాటు.. లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయింది. డ్రగ్స్‌ తీసుకున్న నిర్భయ్‌తో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్‌ దగ్గర వివేకానంద డ్రగ్స్‌ కొనుగోలు చేసి.. పార్టీ చేసుకున్నట్లు తేలింది.

  • Written By:
  • Updated On - February 26, 2024 / 09:06 PM IST

HYDERABAD DRUGS CASE: హైదరాబాద్‌ రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తవ్విన కొద్దీ ఈ కేసులో సంచనాలు బయటకు వస్తున్నాయ్. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయ్‌. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్‌, అబ్బాస్‌, కేదార్‌నాథ్‌, సందీప్‌, సెల్రబిటీలు శ్వేతతో పాటు.. లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయింది. డ్రగ్స్‌ తీసుకున్న నిర్భయ్‌తో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

ALLU ARJUN: మరోసారి తెలంగాణ యాస మాట్లాడతానంటున్న బన్నీ..

అబ్బాస్‌ దగ్గర వివేకానంద డ్రగ్స్‌ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్‌ పేపర్‌లో చుట్టి డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లందిరికీ డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చింది. ఇక ఆరోజు పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఉన్నవాళ్లంతా వీఐపీలు కావడమే ఒక హైలైట్ అయితే.. ఈ కేసులో నమోదయిన 9మంది కూడా టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌కు ఫ్రెండ్స్‌ కావడం మరో హైలైట్. కొందరు ఫ్రెండ్స్ కాగా.. మరికొందరు అంతకుమించి! బినామీలు అని పేరు ఉన్న వాళ్లు కొందరయితే.. బిజినెస్ పార్టనర్‌లు మరికొందరు. దీంతో ఇప్పుడు ఈ డ్రగ్స్‌ కేసులో బన్నీ కూడా చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. డ్రగ్స్‌ కేసులో పోలీసులకు చిక్కిన కేదార్‌ అలియాస్ శెలంగశెట్టి కేదార్‌నాథ్‌.. బన్నీకి చాలా ఆప్తుడు. ఇతను హైదరాబాద్‌లోని చాలా పబ్‌ల్లో పార్టనర్‌గా ఉన్నాడు. హైలైఫ్‌, జూబ్లీ 800, బఫెలో వైల్డ్‌ వింగ్స్‌ పబ్‌ల్లో కేదార్‌నాథ్‌కు పార్టనర్‌షిప్ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్‌కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.

PAWAN KALYAN: పవన్‌ని బూతులు తిట్టినోడికి టికెట్‌.. మహాసేన రాజేశ్‌పై జనసేన ఫైర్‌.. సేనానికి సూటి ప్రశ్నలు..

బన్నీకి.. కేదార్ బినామీ అనే పేరు కూడా ఉంది. ఫాల్కన్ క్రియేషన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ప్రారంభిచిన కేదార్‌.. రెండు సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న గంగం గణేషా.. విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ కాంబోలో రాబోతున్న మూవీకి కేదార్‌నాథే నిర్మాత. ఫాల్కన్‌ అనేది బన్నీ క్యారవాన్ పేరు. ఆ నేమ్‌తోనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశాడు కేదార్. ఇంకా హైలైట్ ఏంటంటే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు కూడా కేదార్‌ ఆప్తమిత్రుడు కావడం. అంతేకాదు.. రాజ్ పాకాలకు కేదార్ వ్యాపార భాగస్వామి కూడా. ఇక ఈ కేసులో చిక్కిన మరో వీఐపీ సందీప్.. అలియాస్ సందీప్‌ రామినేని. ఈయన కూడా బన్నీకి చాలా క్లోజ్‌. ప్రముఖ యాంకర్ గీతా సౌజన్య భర్తే.. సందీప్‌. ఇతను అల్లు అర్జున్‌కి బినామీగా కూడా చలామణి అవుతుంటాడు. వీకెండ్ పార్టీలు, డ్రగ్ పార్టీలు ఆర్గనైజ్ చేయడం సందీప్ పని. సందీప్‌కి సంబంధించి చాలా సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించారు. టీవీ యాక్టర్లు, టాలీవుడ్ యాక్టర్స్‌తోనూ సందీప్‌కి సంబంధాలు ఉన్నాయ్. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. వాటిని వేరేవాళ్లకు ఫ్రెండ్లీగా ఇచ్చినట్లు కూడా సందీప్‌పై ఆరోపణలు ఉన్నాయ్.

ఇక ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తి.. గజ్జల వివేకానంద. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. రాడిసన్ బ్లూ హోటల్‌కు ఓనర్. బీజేపీ నేత, రియల్ ఎస్టేట్‌ వ్యాపారి గజ్జల యోగానంద కుమారుడే ఈ వివేకానంద. మంజీరా గ్రూప్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ మధ్యే రాడిసన్ బ్లూ హోటల్‌ను కొనుగోలు చేశాడు. డ్రగ్స్‌ పార్టీలు ఇవ్వడంలో చాలా పాపులర్‌. హోటల్‌లో ఏడుగురు మిత్రులు, ఇద్దరమ్మాయిలతో డ్రగ్ పార్టీ నిర్వహించాడు. ఆ కేసులో ఇప్పుడు 9మందిపై కేసు నమోదయింది. ఇక అటు వివేకానందకు డ్రగ్స్ సప్లయ్‌ చేసిన చేస్తున్న అబ్బాస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ఎక్కువగా గోవా, ముంబై నుంచి పోలీసు విచారణలో తేలింది.