Unemployed, Pravallika, Suicide : హైదరాబాద్ నగర నడి ఒడ్డున నిరుద్యోగి ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రవల్లిక సూసైడ్ లెటర్..

ఇటీవల గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రవల్లిక రాసిన ఓ లెటర్ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు తెప్పిస్తుంది.

ఇటీవల గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అశోక్ నగర్ , చిక్కడపల్లి లో బృందావన్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటింది ప్రవల్లిక. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తు ఉంటూ.. సడెన్ గా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటంతో తీవ్ర మనస్తాపానికి గురై 25 ఏళ్ల ప్రవల్లిక శుక్రవారం సాయంత్రం అందరు భోజనం చేసేందుకు కిందకు వెళ్లిన సమయంలో ఫ్యాన్‌ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు అందరూ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని చెబుతున్నారు.

చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో అశోక్‌ నగర్‌ లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ సమయంలో తోటి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పోటీ పరీక్షల అభ్యర్థులు ఒక్కసారిగా తిరగబడి పోలీసులను అడ్డుకున్నారు.

హాస్టల్ విద్యార్థులపై లాఠీ ఛార్జ్..

ప్రవల్లిక మృతితో పరిసర హాస్టల్ విద్యార్థులు అందరు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అర్ధరాత్రి వరకు యువతి మృతదేహం హాస్టల్‌ లోనే ఉంది. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేసే వరకు కదలబోమని గ్రూప్స్‌ అభ్యర్థులు అశోక నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ప్రధాన రహదారిపై అర్ధరాత్రి వరకు బైఠాయించి నిరసన తెలిపారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన.. ఫలితం లేనపట్టికి అర్ధరాత్రి దాటిన తర్వాత పోటీ పరీక్షల అభ్యర్థులకు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఎం చేయలేక పోలీసులు నిరుద్యోగులపై లాఠీఛార్జి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాత్రి 1:30 సమయంలో ప్రవల్లిక మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రవల్లిక మృతి పై తోటి విద్యార్థుల నుంచి వివరాలు..

ఆత్మహత్య చేసుకున్న యువతి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, జిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక అని చెప్పారు. ప్రవల్లిక గత రెండు సంవత్సరాలుగా అశోక్ నగర్ లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ సందర్భంగా గ్రూప్ – 2 కి అప్లై చేసిన ప్రవల్లిక.. అశోక్‌ నగర్‌ లో బృందావన్ గర్ల్స్ హాస్టల్‌ లో ఉంటూ కోచింగ్ కు ప్రిపేర్ అవుతుంది. ఇదివరకే ఒకసారి వాయిదా పడిన గ్రూప్ – 2 మళ్లీ వాయిదా పడటంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు పలు సార్లు తన తోటి విద్యార్థులతో స్నేహితులతో చెప్పినట్లు చెప్పారు. వేలకు వేలు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోవడం.. హాస్టల్‌ లో ఉండి చదువుకోవడం తన తల్లిదండ్రులకు భారంగా మారడంతో.. పరీక్ష మళ్లీ వాయిదా పడటంతో దిక్కుతోచని స్థితి యువతి హాస్టల్‌ లో రూంలో ఉరి వేసుకుంది అని అంటున్నారు.

కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రవల్లిక సూసైడ్ లెటర్..

‘నన్ను క్షమించండి అమ్మా!
నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.

నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’  “అమ్మ నాన్న జాగ్రత్తా..”

అని లేఖ రాసింది ప్రవల్లిక.. 

ప్రవల్లిక ఆత్మహత్యపై ప్రభుత్వం పై విపక్షాల ఆగ్రహం..

ప్రవల్లిక మృతి పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం..

అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రాక్షస పాలనలో యువతకు భవిత లేదు అంటూ ప్రభుత్వంపై ప్రభుత్వం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రవల్లిక ఆత్మ ఘోష సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదా.. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీ లక్ష్మీణ్ అరెస్ట్ .. 

హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలిసి బీజేపీ నేత ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ లో ఏం ఉందో చూపించాలని, హాస్టల్ లోపలికి అనుమతించాలని పోలీసులను కోరారు. హాస్టల్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో విద్యార్థులతో ధర్నాలో పాల్గొన్నారు ఎంపీ లక్ష్మణ్. దీంతో ఎంపీ లక్ష్మీణ‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రవల్లిక మృతిపై ఇంత వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు అధికారికంగా స్పందించలేదు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించలేదు.

ప్రవల్లిక అంత్యక్రియలు..

ఇక తీవ్ర ఉద్రిక్తత నడుమ పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి ప్రవల్లిక మృత దేహాన్నికుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి స్వగ్రామం వరంగల్ జిల్లా జిక్కాజిపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు.

S.SURESH