కొన్ని రోజల నుంచి కాంట్రవర్షనల్ డైరెక్టర్ ఆర్జీవీ కుక్కలవెంట పడుతూనే ఉన్నాడు. ఎక్కడ కుక్కలు కనిపిస్తే అక్కడ ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నాడు. చేసిన ప్రతీ పోస్ట్‌లో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ట్యాగ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఓ సాంగ్ రాశేశాడు. ఎవరు దీనికి బాధ్యులు అంటూ మేయర్‌ను సెంటర్ చేశాడు. ప్రజల నుంచి తీసుకున్న పన్నులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఓ వంద కుక్కలు తెచ్చి మేయర్ ఇంట్లో వదిలేస్తే అప్పుడు బాధ తెలుస్తుంది అంటూ మరోసారి ఫైర్ అయ్యాడు. అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో ఓ చిన్న పిల్లాడు చనిపోవడంతో మొదలైంది ఈ రచ్చ.
ఆ ఇన్సిడెంట్ జరిగిన తరువాత హైదరాబాద్‌లో వరుసగా కొన్ని డాగ్ బైట్ కేసులు వచ్చాయి. తెలంగాణలోని రెండు మూడు జిల్లాల్లో కూడా డాగ్ బైట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆర్జీవి కుక్కల వెంట పడటం మొదలు పట్టాడు. వీధి కుక్కలన్నిటికీ మేయర్ ట్రైనింగ్ ఇచ్చి కరిపిస్తోంది అన్న మాదిరిగా ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఆర్జీవీ ఎఫెక్ట్ కాకపోయినా.. ఇష్యూ సీరియస్‌గా మారడంతో చనిపోయిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అయినా ఆర్జీవీ మాత్రం కూల్ అవ్వలేదు. కుక్కలమీద పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా పాట రాశాడు. తరువాత సినిమా తీసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.