Fake Currency: 2వేల నోట్లు అలా ఎలా ప్రింట్‌ ఏసేశారు భయ్యా..!

నకిలీ 2వేల రూపాయల నోట్లు ప్రింట్‌ చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిజం డబ్బు తీసుకొని.. నిమిషాల్లో మార్చి ఇస్తామని దందా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కూపీ లాగగా అసలు డొంక కదిలింది. పోలీసులు రంగంలోకి దిగి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 07:20 PM IST

Fake Currency: ఇంతింత కాదయా నకిలీగాళ్ల లీలలు అన్నట్లు బయటకు వస్తుంటాయి వాళ్ల వ్యవహారాలు. డబ్బుల్లా కనిపించే డబ్బు.. వస్తువుల్లా కనిపించే వస్తువులు.. అచ్చు పోసినట్లు, అద్దంలో చూసినట్లు.. ఎలా ఉందో అలా దింపేస్తుంటారు. అలాంటి ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. నకిలీ 2వేల రూపాయల నోట్లు ప్రింట్‌ చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. నిజం డబ్బు తీసుకొని.. నిమిషాల్లో మార్చి ఇస్తామని దందా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కూపీ లాగగా అసలు డొంక కదిలింది.

అన్వర్ అలియాన్ అన్నూ మియా అనే వ్యక్తి నుంచి అతని ఫ్రెండ్‌ జహేద్‌ అప్పు తీసుకున్నాడు. గంటల్లో తిరిగి ఇస్తానని నమ్మించాడు. తెలిసిన వాడే కదా అని అన్వర్ కూడా మరో ఆలోచన చేయకుండా డబ్బులు ఇచ్చాడు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలిపి మొత్తం 3లక్షల రూపాయలు ఇచ్చాడు. ఐతే అసలు నోట్ల స్థానంలో నకిలీ నోట్లు పెట్టి.. తిరిగి ఆ డబ్బుల బ్యాగ్‌ను అన్వర్‌కు ఇచ్చాడు. చెక్‌ చేస్తే అవి డూప్లికేట్ అని తేలింది. పోలీసులకు సమాచరం అందించడంతో వాళ్లు రంగంలోకి దిగి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

జహేద్‌ ఇంటిని సోదా చేయగా రూ.32లక్షల విలువైన 2వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్యాంగ్ వివరాలు సేకరిస్తున్నారు. నగరం నడిబొడ్డులో ఇలాంటి దందా వెలుగు చూడడంతో జనాలంతా అవాక్కవుతున్నారు.