Shanmukh Jaswanth: సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అవడం అంటే అంత ఈజీ కాదు. స్టార్‌గా ఎదగాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. అభిమానుల్ని సంపాదించుకోవడం అంటే.. కోటిలో ఒకరికో, ఇద్దరికో చాన్స్ దక్కుతుంది. అలాంటిది ఫేమ్ వచ్చినప్పుడు చేసే పనీ, మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పది మందికీ మంచి చేసేలా లేకపోయినా పర్లేదు. మంచి చెప్పేలా ఉండాలి. ఈ విషయం అర్థం కాలేదో.. అర్థం అయి అర్థంలేని పనులు చేస్తున్నాడో కానీ.. యూట్యూబర్ షణ్ముక్ ప్రతీసారి వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు.
SS RAJAMOULI: మళ్లీ రాజమౌళితో ప్రభాస్ సినిమా.. ఎప్పుడు మొదలవుతుందంటే..
ఇక.. నువ్ మారవా అనిపించుకుంటున్నాడు. తన పిల్లబచ్చా వేషాలతో.. మరింత దిగజారుతున్నాడు. ఆ మధ్య తప్పతాగి కారు నడిపి.. రోడ్డుపై నానా హంగామా క్రియేట్ చేశాడు. పోలీసులు రమ్మన్నా.. రాకుండా రుబాబు చేశాడు. పోలీసులు వాళ్ల స్టైల్‌లో తీసుకువెళ్లి.. మర్యాదగా క్లాస్ పీకి పంపించారు. ఇదే పెద్ద తలకు మాసినపని అంటే.. ఇప్పుడు అంతకు మించిన దరిద్రపు పనిచేశాడు. గంజాయి కొడుతూ దొరికిపోయాడు. మౌనిక కేసులో అతని అన్నతో పాటు.. షణ్ముక్‌ను కూడా అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌కు, సంపత్‌కు ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉందని తెలుస్తోంది. షణ్ముఖ్ దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని.. దానికి సంబంధించిన వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని మౌనిక చెప్తోంది. దీంతో షణ్ముఖ్ ఏంటో, అతని బిహేవియర్ ఏంటో అందరికీ అర్థమైంది. ఒక తప్పు అంటే ఓకే.. ఇలా వరుసబెట్టి అన్నాదమ్ములిద్దరూ తప్పుల మీద తప్పులు చేస్తుంటే.. మీరు మనుషులా.. మానవ మృగాలా అని క్వశ్చన్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
Meenakshi Chaudhary: గుంటూరు కారంలో ఆమ్లెట్ వేస్తే.. అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్..?
ఇన్‌ఫ్లూయెన్సర్ అంటేనే మంచి వైపు జనాలను ఇన్‌ఫ్లూయెన్స్ చేసేశాడు. లేదంటే మంచి ఆలోచనలు వచ్చేలా చేసేవాడు. వాళ్లు చెప్పే ప్రతీ మాటకు.. చాలా రీచ్ ఉంటుంది. వాళ్లు ఏం చెప్పినా ఈజీగా నమ్మేసే జనాలు కొందరైతే.. ఆలోచించేవాళ్లు లక్షల్లో ఉంటారు. షణ్ముఖ్‌కి సోషల్ మీడియాలో విపరీతైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇతను వీడియో పెడితే లక్షలో వ్యూస్ ఈజీగా వస్తాయ్. అలాంటి మంచి లైఫ్ ఉండి, ఇలాంటి పనులు చేయడం ఏంటని షణ్ముఖ్‌ను ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఐతే ఇప్పుడు ఇన్ని సుప్పనాతి వేశాలు వేసి.. మళ్లీ స్క్రీన్ ముందు సుద్దపూసలాగా యాక్ట్ చేస్తాడేమో అంటూ ఆడుకుంటున్నారు మీమర్లు.