Shiva Balakrishna : డ్రైవర్‌కు గిఫ్ట్‌గా హోండా సిటీ కారు.. శివబాలకృష్ణ లీలలు అన్నీ ఇన్నీ కాదయా…

HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో.. అవాక్కయ్యే వాస్తవాలు బయటకు వస్తున్నాయ్. తన పేరుతోనే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి, దూరపు బంధువుల పేరుతో కూడా.. ఈ అవినీతి తిమింగలం భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరికి తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా వదల్లేదీ జలగ.

  • Written By:
  • Updated On - February 14, 2024 / 03:28 PM IST

HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో.. అవాక్కయ్యే వాస్తవాలు బయటకు వస్తున్నాయ్. తన పేరుతోనే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి, దూరపు బంధువుల పేరుతో కూడా.. ఈ అవినీతి తిమింగలం భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరికి తన దగ్గర పనిచేసే వాళ్లను కూడా వదల్లేదీ జలగ. ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. బినామీలను అదుపులోకి తీసుకుంటోంది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయ్. తన దగ్గర పనిచేసే అటెండర్‌, డ్రైవర్‌ పేరుతోనూ శివబాలకృష్ణ ఆస్తులు వెనకేశాడు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పనిచేసిన హబీబ్‌, డ్రైవర్‌ గోపీని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఆయనకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. దీంతో ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని తెలుస్తోంది. డ్రైవర్‌ గోపీకి కాస్ట్‌లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీళ్లిద్దరి పేరుతో ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇక అటు శివబాలకృష్ణ బినామీలు.. భరత్, భరణి, సత్యనారాయణ, శ్రీకర్‌కు ఏసీబీ నోటీసులు పంపించింది. భరత్‌, భరణి.. ఇద్దరు కూడా శివబాలకృష్ణకు మేనల్లుళ్లు అవుతారు. భరణిని.. HMDAలో శివబాలకృష్ణ కంప్యూటర్ ఆపరేటర్‌గా పెట్టించాడు. ఆ తర్వాత ఈ సుద్దపూసకు.. భరణి పీఏగా కూడా వ్యవహరించాడు. ఇక అటు ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో భరత్‌ ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తుండగా.. ఈ కంపెనీ ద్వారానే తన దందా కంటిన్యూ చేశాడు శివబాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లే అవుట్ బిల్డింగ్‌లకు అన్ని అనుమతులు.. ఈ కంపెనీ ద్వారానే ఇచ్చేవాడు. మరో బినామీ ప్రమోద్ కుమార్‌కు.. మీనాక్షి కన్‌స్ట్రక్షన్‌లో ఉద్యోగం ఇప్పించి శివబాలకృష్ణ తన పనులన్నీ చేయించాడు. తన మేనల్లుళ్లనే సైన్యంగా మార్చుకొని.. ఓ అవినీతి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు శివబాలకృష్ణ. ఇక అటు రక్త సంబంధాన్ని కూడా తన దందాకు వాడుకున్నాడు. శివబాలకృష్ణ ఆర్థిక లావాదేవీలన్నీ.. ఆయన తమ్ముడు నవీన్‌కుమార్ చూసేవాడు. ఇప్పుడు వీళ్లందరికీ నోటీసులు పంపించిన ఏసీబీ అధికారులు.. విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయనే ఆసక్తి కనిపిస్తోంది.