Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు సైనికులు గాయపడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా, రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు.
SALAAR REVIEW: సలార్ ఫస్ట్ రివ్యూ.. అరాచకానికి అర్థం చెప్పారు..
పూంఛ్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇందుకోసం బఫ్లియాజ్ ప్రాంతం నుంచి జవాన్లను వాహనంలో తీసుకువెళ్తున్నారు. థానమండి-సురన్‌కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలు వెళ్తుండగా ఒక్కసారిగా ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గురువారం మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు.
తీవ్రవాదులు కాల్పులు జరపగానే.. జవాన్లు కూడా ఎదురు కాల్పులకు దిగారు. జవాన్ల మృతదేహాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు తీవ్రవాదుల్ని వేటాడేందుకు మరిన్ని అదనపు బలగాల్ని ఈ ప్రాంతానికి తరలించారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో తీవ్రవాద దాడి జరగడం ఇది రెండోసారి.