కేజ్రివాల్ తరువాత నీవే అంటూ కవితకు వార్నింగ్ ఇచ్చాడు. తనను దొంగ, ఆర్థిక నేరగాడు అంటూ విమర్శించిన కేజ్రివాల్, కవిత కూడా ఆర్థిక నేరగాళ్లే అంటూ రివర్స్ ఎటాక్ దిగాడు. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణజరిగేలా సహకరించాలని కవితకు సవాల్ విసిరాడు. కవితను తాను సొంత అక్కలా భావించి అక్కా అని పిలిచానని.. కానీ వాళ్లు మాత్రం తనను అవసరానికి వాడుకుని వదిలేశారన్నాడు. ఇప్పుడు దేశం ప్రయోజనాల కోసమే ఈ నిజాలు బయటపెడుతున్నానంటూ చెప్పాడు.
లిక్కర్ స్కాంలో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరినీ ఖచ్చితంగా బయటకు లాగుతానన్నాడు. మొత్తం 703 చాటింగ్స్ తన దగ్గర ఉన్నాయని.. ఇప్పటి వరకూ జస్ట్ రెండు చాట్స్ మాత్రమే రిలీజ్ చేశానన్నాడు. ఇంకా చాలా వీడియోలు, చాట్లు, ఫోటోలు, తన దగ్గరే ఉన్నాయన్నాడు. వాటిని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తానని చెప్పాడు. అయితే సుఖేష్ చంద్రశేఖర్ చెప్పేవన్నీ అబద్దాలేనని.. అతనికి తెలుగు ఎలా వచ్చు అంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. దీనికి కూడా లెటర్‌లో కౌంటర్ ఇచ్చాడు సుఖేష్.
తన తండ్రి తెలుగు వాడని తల్లి తమిళ్ అని రెండు తనకు మాతృభాషలే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ రెండే కాకుండా తాను చాలా భాషలు మాట్లాడుతానని కూడా లెటర్‌లోమెన్షన్ చేశాడు సుఖేష్. తనను ఎవరో రాజకీయంగా ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు. తాను నిర్దోషిగా బయటకు వస్తానని నమ్ముతున్నట్టు చెప్పాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని చెప్పాడు. తన గుండెల్లో ఉన్న భారాన్ని దించుకునేందుకే ఈ చాట్స్ మొత్తం బయటపెడుతున్నట్టు చెప్పాడు.
కవిత, కేజ్రివాల్ ఇద్దరూ సీబీఐ విచారణకు సహకరించాలని లెటర్‌లో తెలిపాడు సుఖేష్. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సౌత్ గ్రూప్ కవిత హ్యాడోవర్‌లోనే ఉందని రీసెంట్‌గా బాంబు పేల్చాడు సుఖేష్. హైదరాబాద్‌లో తాను 15 కోట్లు ఇచ్చింది అరుణ్ పిళ్లైకే అని చెప్పాడు. అప్పుడు కూడా కవితతో చేసిన చాటింగ్‌ను రివీల్ చేశాడు కానీ నెంబర్ మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఫోన్ నెంబర్లతో సహా రివీల్ చేసి మరోసారి ప్రకంపణలు సృష్టించాడు.